Share News

ఇరాన్‌పై దాడుల తీవ్రత తగ్గిస్తాం

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:50 AM

ఇరాన్‌లో తాము అనుకున్న లక్ష్యాలన్నింటినీ దాదాపు సాధించామని, ఈ క్రమంలో దాడుల తీవ్రతను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. అయితే దాడులను...

ఇరాన్‌పై దాడుల తీవ్రత తగ్గిస్తాం

అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాం

సీజ్‌ఫైర్‌ మాకూ అవసరం లేదు

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాగ్చీ

  • కాల్పుల విరమణ మాత్రం ఉండదు: ట్రంప్‌

  • విరమిస్తామన్నా మేం అంగీకరించం: అరాగ్చీ

వాషింగ్టన్‌, మార్చి 21: ఇరాన్‌లో తాము అనుకున్న లక్ష్యాలన్నింటినీ దాదాపు సాధించామని, ఈ క్రమంలో దాడుల తీవ్రతను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. అయితే దాడులను పూర్తిగా నిలిపివేసే ఉద్దేశమేదీ లేదని స్పష్టం చేశారు. ‘‘మా లక్ష్యాల్లో.. ఒకటి ఇరాన్‌ క్షిపణులు, లాంచర్లు, సంబంధిత అంశాలను పూర్తిగా పూర్తిగా దెబ్బతీయడం, రెండోది రక్షణ పరిశ్రమలను ధ్వంసం చేయడం, మూడోది వారి నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేయడం, నాలుగోది ఇరాన్‌ ఎప్పటికీ అణ్వస్త్ర సామర్థ్యం పొందకుండా చేయడం, అలా చేస్తే అమెరికా వెంటనే స్పందించగల స్థితిలో ఉండటం, ఐదవది ఇజ్రాయెల్‌తోపాటు సౌదీ అరేబియా, ఖతార్‌, యూఏఈ, బహ్రెయిన్‌, కువైట్‌ తదితర పశ్చిమాసియా దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పించడం. ఇవన్నీ మేం సాధించాం. ఇక హోర్ముజ్‌ జలసంధిని కాపాడుకునే, పర్యవేక్షించే బాధ్యత దానిని ఉపయోగించుకునే దేశాలదే. అమెరికాకు సంబంధం లేదు. కావాలంటే మేం సహాయం చేస్తాం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అంతకుముందు వైట్‌హౌజ్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై కాల్పుల విరమణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని, అవతలి వారిపై గెలుస్తున్నప్పుడు కాల్పుల విరమణ ఎందుకని పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ దీటుగా స్పందించారు. ‘‘దాడుల నిలిపివేత మాక్కూడా అవసరం లేదు. ఎలాంటి కాల్పుల విరమణకు మేం అంగీకరించబోం’’ అని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 06:50 AM