ఖమేనీ నలుగురు కొడుకులు క్షేమం.. వెలుగుచూసిన ఫోటోలు
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:04 PM
ఇజ్రాయెల్ తొలి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లి అలీ ఖమేనీ మృతి తీవ్ర సంచలనమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కొడుకుల్లో ఒకరు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారులు నలుగురు క్షేమంగా ఉన్నారు.
టెహ్రాన్: ఇజ్రాయెల్ తొలి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లి అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతి తీవ్ర సంచలనమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీపాటు ఆయన కొడుకుల్లో ఒకరు మృతి చెందినట్టు తొలి వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారులు నలుగురు క్షేమంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఖమేనీ మరణించినప్పటికీ ఆయన నలుగురు కొడుకులైన ముస్తాఫ్ ఖమేనీ, మొజ్తబా ఖమేనీ, మసూదు ఖమేనీ, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. వారి ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఖమేనీ మృతి తర్వాత సుప్రీం లీడర్ ఎంపిక కోసం అన్వేషణ జరుగుతున్న తరుణంలో ఫోటోలు విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖమేనీ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచేవారు. అరుదుగా మాత్రమే ఆయన తన భార్య, కుమారులతో కనిపించే వారు. క్రియాశీలక రాజకీయాలకు కుమారులను దూరంగా ఉంచేవారు. ఆయన కుటుంబంలోని ఒకరిద్దరు మాత్రమే రాజకీయాల్లో ప్రభావం కనబరచే వారని చెబుతుంటారు.
ఖమేనీ భార్య మన్సూరే భోజస్తే బాఘెర్జాదే ఎప్పుడూ ప్రచారానికి దూరంగానే ఉండేవారు. ఇరాన్‌లోని ఓ ప్రముఖ వ్యాపారి కుటుంబంలో 1947లో ఆమె జన్మించారు. 1964 ఖొమేనీని వివాహమాడారు. ఇరాన్‌లోని తలెత్తిన ఇస్లామిక్ విప్లపంతో సహా ఇరాన్ రాజకీయ చరిత్రలో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పడల్లా ఖమేనీకి ఆమె బాసటగా నిలిచారు. ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడల్లో ఖమేనీ మరణించడంలో ఆయన కుటుంబం భవిష్యత్తు, ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా వాళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడినైనా నిస్సందేహంగా అంతం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదన్నారు. ఈ క్రమంలోనే ఖమేనీ రెండో కుమారుడు మజ్తబాను తమ సుప్రీం నేతగా ఇరాన్ అసెంబ్లీలోని కీలక నేతలు ఎన్నుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ