ఇరాన్ యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇజ్రాయెల్ ఎఫ్-35 ఫైటర్ జెట్
ABN , Publish Date - Mar 04 , 2026 | 06:17 PM
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానికి దాడులతో ఇజ్రాయెల్ బుధవారంనాడు భీకరంగా విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన యాక్-130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతంలో ఇజ్రాయెల్ అడ్వాన్స్‌డ్ ఎఫ్-35 యుద్ధవిమానం కూల్చేసింది.
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానికి దాడులతో ఇజ్రాయెల్ బుధవారంనాడు భీకరంగా విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన యాక్-130 (YAK-130) యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతంలో ఇజ్రాయెల్ అడ్వాన్స్‌డ్ ఎఫ్-35 (F-35) యుద్ధవిమానం కూల్చేసింది. ఎఫ్-35 ఫైటర్ జెట్ ఒక మానవ సహిత శత్రు విమానాన్ని గగనతంలో కూల్చివేయడం ఇదే తొలిసారని ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) తెలిపింది.
ఇజ్రాయెల్ ఎఫ్-35 స్పెషల్ వెర్షన్ యుద్ధ విమానాన్ని అమెరికా డిఫెన్స్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ నిర్మించింది. ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్‌డ్ యుద్ధవిమానాల్లో ఇది ఒకటిగా చెబుతారు. రాడార్‌లు కనిపెట్టడానికి వీలులేని విధంగా ప్రత్యేక ఫీచర్స్‌తో దీన్ని రూపొందించారు. ప్రత్యేకమైన ఆకారంలో, ఇంటర్నల్ వెపన్స్ స్టోరీజీ, సెన్సార్లు, ఫ్యూయెల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. కాగా, యాక్-130ను రెండు సీట్లతో ట్రైనింగ్, లైట్ కంబాట్ జెట్‌గా రష్యా రూపొందించింది. ప్రధానంగా దీనిని పైలట్ల శిక్షణకు ఉపయోగిస్తారు. పోరాటాల సమయలో ఆయుధాలు తీసుకువెళ్లేందుకు కూడా దీనిని ఉపయోగిస్తుంటారు.
టెహ్రాన్‌లో పేలుళ్ల మోత
ఇజ్రాయెల్ బుధవారం తెల్లవారుజాము నుంచే టెహ్రాన్‌పై పెద్దఎత్తున విరుచుకుపడింది. రాజధాని నగరం చుట్టూ భారీ పేళ్లులు వినిపించినట్టు ఇరాన్ టెలివిజన్ రిపోర్ట్ చేసింది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. జెరూసలేం సమీపంలో కూడా పేలుళ్లు వినిపించాయి.
ఇవి కూడా చదవండి..
శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి.. 101మంది గల్లంతు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఐదోరోజూ ఇజ్రాయెల్, ఇరాన్ హోరాహోరీ దాడులు