Share News

మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫొటోలు విడుదల చేసిన ఇరాన్

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:57 PM

ఇరాన్‌లోని మినాబ్‌లో ఎలిమెంటరీ స్కూలుపై ఇటీవల అమెరికా క్షిపణి దాడి జరిపి 170 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్షిపణిని ప్రయోగించిన అమెరికా నౌకాదళ అధికారుల ఫోటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది.

మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫొటోలు విడుదల చేసిన ఇరాన్
US Navy officials

టెహ్రాన్: ఇరాన్‌లోని మినాబ్‌లో ఎలిమెంటరీ స్కూలుపై ఇటీవల అమెరికా క్షిపణి దాడి జరిపి 170 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్షిపణిని ప్రయోగించిన అమెరికా నౌకాదళ అధికారుల ఫొటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది. 'ఈ ఇద్దరు క్రిమినల్స్‌ను గుర్తుంచుకోండి' అంటూ వారి చిత్రాలను సౌత్ ఆఫ్రికా, భారత్, ఇతర దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విడుదల చేశాయి.


'ఈ ఇద్దరు క్రిమినల్స్‌ను గుర్తుంచుకోండి. వీరు అమెరికా యుద్ధనౌక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ యూ యార్క్, కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్ టేట్. మూడుసార్లు తోమహాక్ క్షిపణుల దాడికి వీరు ఆదేశాలిచ్చారు. మినాబ్ పాఠాశాలలోని 168 మంది అమాయక చిన్నారులను పొట్టనపెట్టుకున్నారు' అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.


కాగా, ఈ ఘటన పొరపాటున జరిగినట్టు అమెరికా సమర్థించుకుంది. అమెరికా మీడియా కూడా సమర్థనగా కథనాలు ప్రచురించింది. పాఠశాలకు సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరం లక్ష్యంగా దాడి జరిగిందని, కాలంచెల్లిన ఇంటెలిజెన్స్ సమాచారం కారణంగా పొరపాటు జరిగిందని పేర్కొన్నాయి. అయితే పక్కా ప్లాన్‌తోనే ఈ దాడులు జరిపినట్టు ఇరాన్ విరుచుకుపడింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, కచ్చితత్వంతో కూడిన మిలిటరీ, డాటా సిస్టమ్ కలిగి ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా దాడి జరపలేదని చెప్పడాన్ని ఎవరూ నమ్మరని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. అవాక్స్ విమానం ధ్వంసం

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం!

Updated Date - Mar 29 , 2026 | 07:56 PM