భారత్‌కు వస్తున్న థాయ్‌లాండ్ కార్గో షిప్‌పై క్షిపణి దాడి.. 22 మందిని కాపాడిన నేవీ
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:53 PM
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న థాయ్‌లాండ్ కార్గో షిప్‌పై క్షిపణి దాడి జరిగింది. ఒమన్ తీర ప్రాంతం సమీపంలో కార్గో షిప్ మయూరీ నారీని ఇరాన్ ప్రాజెక్టైల్ ఢీకొన్నట్టు థాయ్ అధికారులు తెలిపారు.
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న థాయ్‌లాండ్ కార్గో షిప్‌పై క్షిపణి దాడి జరిగింది. ఒమన్ తీర ప్రాంతం సమీపంలో కార్గో షిప్ మయూరీ నారీ (Mayuree Naree)ని ఇరాన్ ప్రాజెక్టైల్ ఢీకొన్నట్టు థాయ్ అధికారులు తెలిపారు. థాయ్‌లాండ్ నేవీ, అంతర్జాతీయ తీరప్రాంత అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రొజక్టైల్ దాడితో నౌకలో మంటలు చెలరేగి సగభాగం కాలిపోయిందని, 20 మంది సిబ్బందిని రెస్క్యూ టీమ్ కాపాడగా, మరో ముగ్గురు ఓడలోనే చిక్కుకుపోయారని తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మయూరీ నారీ ఇంధన నౌక గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తుండగా ఈదాడి జరిగింది. మరో రెండు నౌకలు కూడా భద్రతా కారణాలతో హోర్జుజ్ జలసంధిలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.
ఆయిల్ టాంకర్ల కదలికలను అడ్డుకునేందుకు హోర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో క్రూడాయిల్, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచ దేశాలపై ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తున్నట్టు ఆందోళనలు వ్యక్తమవుతుండగా, తాజాగా థాయ్‌లాండ్ కార్గోషిప్‌పై దాడి మరింత ఆందోళనకు తావిస్తోంది. ఈ దాడి ఎవరు చేశారనేది ఇంకా నిర్దారణ కానప్పటికీ, హౌతీ తిరుగుబాటుదారుల పని కావచ్చని వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇక అమెరికా బ్యాంకులపై గురి.. ఇరాన్ మిలటరీ కమాండ్ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఐటీ కంపెనీలకు ఇరాన్ హెచ్చరికలు