Share News

ఇక అమెరికా బ్యాంకులపై గురి.. ఇరాన్ మిలటరీ కమాండ్ హెచ్చరిక

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:06 PM

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మిలటరీ కమాండ్ తాజా హెచ్చరికలు చేసింది. ఇంతవరకూ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుపుతున్న తమ దళాలు పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాలను టార్గెట్ చేయనున్నట్టు హెచ్చరించింది.

ఇక అమెరికా బ్యాంకులపై గురి.. ఇరాన్ మిలటరీ కమాండ్ హెచ్చరిక
US-Iran conflict

టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మిలటరీ కమాండ్ తాజా హెచ్చరికలు చేసింది. ఇంతవరకూ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుపుతున్న తమ దళాలు పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాలను టార్గెట్ చేయనున్నట్టు హెచ్చరించింది. టెహ్రాన్‌లోని ఇరాన్ బ్యాంక్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు తాజా దాడి నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.


'అమెరికా, జియోనిస్ట్ పాలకులకు చెందిన ఆర్థిక కేంద్రాలను టార్గెట్ చేసేందుకు శత్రువే మాకు అవకాశం ఇచ్చాడు' అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన ఖతం అలన్-అల్ అన్బియా ప్రధాన కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా దేశాల్లోని ప్రజలు బ్యాంకులకు 1,000 మీటర్ల దూరంలో ఉండాలని ఆయన హెచ్చరించారు. టెహ్రాన్‌లోని ఇరానియన్ బ్యాంకుపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో పలువురు ఉద్యోగులు చనిపోయినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. ఇందుకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించినట్టు ఐఆర్ఎన్ఏ వార్త సంస్థ వెల్లడించింది.


ఇరాన్ తాజా హెచ్చరికలతో ముఖ్యంగా దుబాయ్, యూఏఈలోని పెద్ద సంఖ్యలో ఉన్న అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలోనూ ప్రధానమైన ప్రాంతీయ ఆర్థిక కేంద్రాలు ఉన్నాయి.


మరోవైపు, పర్షియన్ గల్ఫ్ వెంబడి ఇరాన్ మిలటరీ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ ట్రావెల్ హబ్‌లలో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో నలుగురు గాయపడ్డారు. అయితే విమాన సర్వీసులు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. గల్ఫ్ వెంబడి పలు కమర్షియల్ షిప్పింగ్‌లపైనా ఇరాన్ దాడులు సాగిస్తోంది. హోర్ముజ్ జలసంధి వద్ద నిలిపి ఉంచిన కంటైనర్ షిప్‌ను ఇరాన్ ప్రొజక్టైల్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. యూఏఈ సమీపంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు.


ఇరాన్ డ్రోన్లు, క్షిపణలు విరుచుకుపడుతుండటంతో రీజినల్ డిఫెన్స్‌లను గల్ఫ్ దేశాలు యాక్టివేట్ చేశాయి. ఎనిమిది ఇరాన్ డ్రోన్లలను తమ ఎయిర్ ఢిపెన్స్ కూల్చేసినట్టు కువైట్ ప్రకటించగా, తమ ఆయిల్ ఫీల్డ్‌ దిశగా వెళ్తున్న డ్రోన్లను కూల్చేసినట్టు సౌదీ అరేబియా తెలిపింది. దాడుల కారణంగా హోర్జుజ్ జలసంధి వెంబడి వాణిజ్య నౌకలు నిలిచిపోయి వరుసగా ఐదోరోజు కూడా ఆయిల్ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగింది. గల్ఫ్ అరబ్ దేశాల్లోని రిఫైనరీలను సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఇందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిళ్లు తీవ్రమై దాడులు ఆపేయాలంటూ వాషింగ్టన్, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

పశ్చిమాసియాలో ఐటీ కంపెనీలకు ఇరాన్‌ హెచ్చరికలు

క్షేమంగా ఉన్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా

Updated Date - Mar 11 , 2026 | 05:58 PM