చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:15 PM
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Trump China warning Iran).
ఇరాన్‌తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌ను తాము సైనికపరంగా ఓడించామని అన్నారు. యుద్ధం విషయంలో నాటో వైపు నుంచి అమెరికాకు ఎలాంటి సహాయం లభించలేదని చెప్పారు. కాగా, భుజం మీద పెట్టుకొని ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్‌లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్‌కు సరఫరా చేయడానికి బీజింగ్ సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి (China weapons Iran news).
ఇప్పటికే చైనా ఆయుధాల సరఫరా ప్రారంభించిందని, వారం రోజుల్లో అవి ఇరాన్‌కు చేరుతాయని వార్తలు వస్తున్నాయి (US Iran conflict China role). ఈ వార్తల నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. అలాంటి పనులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, ఈ వార్తలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ పక్షానికీ, ఎలాంటి ఆయుధాలూ సరఫరా చేయలేదని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్
అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్