వెయ్యి మందిని తీసేసి.. 50 రోబోలను పెట్టుకుని.. జనరల్ మోటార్స్ తీరుపై విమర్శలు..
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:03 PM
అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ డెట్రాయిట్‌లోని తన ప్రధాన విద్యుత్ వాహనాల కర్మాగారంలో 1,000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ డెట్రాయిట్‌లోని తన ప్రధాన విద్యుత్ వాహనాల కర్మాగారంలో 1,000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వారి స్థానాల్లో కేవలం 50 రోబోలను తీసుకుని కార్యకలాపాలు సాగిస్తోంది. దీంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి (General Motors layoffs).
డెట్రాయిట్‌లోని 'ఫ్యాక్టరీ జీరో' కర్మాగారంలో ఈ 'సహకార రోబోలు' (కోబాట్లు) వాహనాల అసెంబ్లీ పనుల్లో మిగతా కార్మికులతో కలిసి పని చేస్తున్నాయి. విద్యుత్ వాహనాలపై డిమాండ్ తగ్గడం, ఖర్చులు నియంత్రించాల్సిన అవసరం నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ చర్యపై కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఉద్యోగాలను తగ్గించేందుకే రోబోలను తీసుకొచ్చారని, ఇది కార్మికుల భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని సంఘ నేతలు ఆరోపించారు (GM robots).
తమ కార్యకలాపాల్లోకి అధునాతన సాంకేతికతను మిళితం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోబోలను తీసుకొచ్చామని జనరల్ మోటార్స్ కంపెనీ ప్రతినిధి తెలిపారు (Detroit Factory Zero). రోబోల వినియోగం వల్ల కార్మికుల భద్రత, పని సౌలభ్యం మెరుగుపడుతుందని, అంతర్జాతీయ పోటీలో నిలబడేందుకు ఆధునిక సాంకేతికత అవసరమని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..