రూ.4,700 కోట్లు ఖర్చు చేసిన మస్క్.. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై డెమోక్రాట్‌ల గురి..
ABN , Publish Date - Nov 04 , 2026 | 09:42 PM
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీగా డబ్బు ఖర్చు చేశారు. ఏకంగా రూ.4,700 కోట్లకు పైగా వెచ్చించి రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీగా డబ్బు ఖర్చు చేశారు. ఏకంగా రూ.4,700 కోట్లకు పైగా వెచ్చించి రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల్లో డెమోక్రాట్‌లు విజయం సాధించారు. దీంతో మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థలపై విచారణలు, నియంత్రణ చర్యలు పెరిగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది (Elon Musk US Midterms).
2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా మస్క్ వందల మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. ముఖ్యంగా టెక్సాస్‌లో రిపబ్లికన్ అభ్యర్థుల కోసం ఆయన సుమారు 224 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ డెమోక్రాట్ అభ్యర్థులు విజయం సాధించడంతో మస్క్ పెట్టిన పెట్టుబడికి ఆశించిన ఫలితం దక్కలేదు. అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్‌లకు ఆధిపత్యం రావడంతో మస్క్ వ్యాపార సంస్థలపై పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు, సబ్సిడీలు, డోజ్‌లో ఆయన నిర్వహించిన పాత్రపై విచారణలు చేపట్టాలని డెమోక్రాట్ నేతలు గతంలోనే డిమాండ్ చేశారు (Elon Musk Political Spending).
మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థలకు అమెరికా ప్రభుత్వంతో కీలక సంబంధాలు ఉన్నాయి (Democrats Victory 2026). టెస్లాకు టెక్సాస్‌లో భారీ తయారీ కేంద్రం ఉంది. స్పేస్‌ఎక్స్‌కు అక్కడే స్టార్‌బేస్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది. ఈ సంస్థల విస్తరణకు ప్రభుత్వ అనుమతులు, భూమి, పన్ను రాయితీలు, ఇతర సౌకర్యాలు అవసరం. డెమోక్రాట్‌లు అధికారికంగా విచారణలు చేపడితే ఈ ఒప్పందాలు, రాయితీలపై మరింత పరిశీలన జరగవచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత నవంబర్ 4న ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు సుమారు 4.4 శాతం, స్పేస్‌ఎక్స్ షేర్లు 4.6 శాతం వరకు పడిపోయాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..