నన్ను తెలివితక్కువవాడని పిలవకండి: ట్రంప్
ABN , Publish Date - May 23 , 2026 | 09:48 PM
తనను తెలివి తక్కువ వాడు (Dumb) అని పిలవొద్దని, కావాలంటే ప్రతిభావంతుడైన నిరంకుశ నియంత అని పిలుచుకోండని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ తన మానసిక సామర్థ్యం గురించి మాట్లాడారు.
తనను తెలివి తక్కువ వాడు (Dumb) అని పిలవొద్దని, కావాలంటే ప్రతిభావంతుడైన నిరంకుశ నియంత అని పిలుచుకోండని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ తన మానసిక సామర్థ్యం గురించి మాట్లాడారు. తనను ఎవరైనా తెలివి తక్కువ వాడని అంటే విపరీతంగా బాధపడతానని చెప్పుకొచ్చారు (Donald Trump).
'మీరు కలిసిన వారిలోకెల్లా నేనే అత్యంత తెలివైన వ్యక్తిని' అని ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న జనసమూహంతో అన్నారు. ఆ తర్వాత, 'మరి మీకు తెలివైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని లేదా' అని ప్రశ్నించారు. వాస్తవానికి ఆ ర్యాలీ ద్రవ్యోల్బణం, అందుబాటు ధరల గురించి ఉద్దేశించింది. అయితే ట్రంప్ మాత్రం తన మానసిక ఆరోగ్యం గురించే ఎక్కువగా మాట్లాడారు. తన తెలివి గురించి పరీక్షించుకునేందుకు ఓ వైద్యుడిని కలిసి టెస్ట్ కూడా చేయించుకున్నానని చెప్పారు (Trump cognitive test).
డాక్టర్ తనకు ఒక మేధోపరమైన పరీక్ష నిర్వహించారని, అందులో తాను అత్యధిక మార్కులు సంపాదించుకున్నానని ట్రంప్ తెలిపారు (Trump mental fitness). తాను ఉత్తీర్ణత సాధించానని ట్రంప్ చెప్పుకుంటున్న 'మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్‌మెంట్' అనేది, మతిమరుపు వ్యాధిని (డిమెన్షియాను) గుర్తించడానికి చేసే ఒక పరీక్ష. వైద్యులు నిర్వహించిన ఆ పరీక్షలో తాను మూడుసార్లు ఉత్తీర్ణుడనయ్యానని ట్రంప్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..
టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..