జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి కారణమేంటి.. ఎన్విడియా బోర్డుతో ట్రంప్ మాట్లాడారా..
ABN , Publish Date - Nov 23 , 2026 | 09:51 PM
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో ఇదే చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలంటూ ఎన్విడియా డైరెక్టర్ల బోర్డుతో ట్రంప్ నేరుగా మాట్లాడినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి (Donald Trump Jensen Huang).
జెన్సన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా సీఈఓగా బాధ్యతలు చేపట్టడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ప్రభుత్వ స్థాయిలో భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ట్రంప్ ఫోన్ ద్వారా పాల్గొని, హువాంగ్‌ను తిరిగి నియమించాలని సూచించినట్టు 'సెమాఫోర్' ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించినట్లు పేర్కొంది. అంతేకాకుండా, సీఈఓగా హువాంగ్ తిరిగి రావడంపై ఎన్విడియా బోర్డు, జాతీయ భద్రతకు సంబంధించిన భరోసా కోరిందని ట్రంప్ స్వయంగా 'సీఎన్‌బీసీ'కి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. హువాంగ్ వల్ల అమెరికా భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు (Trump Nvidia News).
హువాంగ్ తిరిగి రావడంపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించారు (Nvidia Board Meetin). ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. హువాంగ్‌ను గొప్ప దేశభక్తుడిగా, దేశానికి విలువైన వ్యక్తిగా అభివర్ణించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, ఎన్విడియా విజయానికి హువాంగ్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అమెరికా తన ప్రతిభావంతులను కాపాడుకోవాలని కూడా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..