Share News

అలాస్కాలో కుప్పకూలిన చార్టర్ విమానం.. 8మంది మృతి..

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:28 AM

అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 8మంది మృతిచెందినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.

అలాస్కాలో కుప్పకూలిన చార్టర్ విమానం.. 8మంది మృతి..
Alaska Plane Crash

న్యూఢిల్లీ: అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 8మంది మృతిచెందినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. ప్రమాదానికి గురైన విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అలాస్కా ప్రాంత అధికారి క్లింట్ జాన్సన్ తెలిపారు.


గురువారం నాడు యాంకరేజ్ నుంచి విమానం బయలుదేరి కేప్ న్యూనెహామ్ ప్రాంతానికి చేరుకుంటుండగా ప్రమాదం జరిగింది. కేప్ న్యూనెహామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ సమీపంలోనే కూలిపోయింది. ఈ ప్రాంతం యాంకరేజ్‌కు సుమారు 450 మైళ్ల దూరంలోని మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. విమాన ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అలాస్కా రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. తొలుత విమానంలో ఉన్నవారి పరిస్థితిపై స్పష్టమైన సమాచారం అందలేదు. అనంతరం అమెరికా సైన్యం 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించింది.


అయితే, విమానం ఎందుకు కుప్పకూలిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్‌టీఎస్‌బీ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిగే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..

పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 11:32 AM