Share News

ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ మిలిటరీ ప్రకటన

ABN , Publish Date - Mar 21 , 2026 | 07:25 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు అడ్డుకట్ట పడటం లేదు. తమపై దాడికి దిగిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ మిలిటరీ శనివారంనాడు ప్రకటించింది. దీనికి ఒకరోజు ముందే ఆమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఢీ కొట్టామని ఇరాన్ ప్రకటించుకుంది.

ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ మిలిటరీ ప్రకటన
Israeli Fighter jet

టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు అడ్డుకట్ట పడటం లేదు. తమ భూభాగంపై దాడికి దిగిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ మిలిటరీ శనివారంనాడు ప్రకటించింది. దీనికి ఒకరోజు ముందే ఆమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఢీ కొట్టామని ఇరాన్ ప్రకటించుకుంది.


ఇజ్రాయెల్ యుద్ధవిమానంపై దాడి జరిగినట్టు ఇజ్రాయెల్ కూడా గుర్తించిందని 'టెహ్రాన్ టైమ్స్' తెలిపింది. తమ యుద్ధవిమానాన్ని టార్గెట్ చేస్తూ ఉపరితలం నుంచి గగనతలంపైకి క్షిపణిని ప్రయోగించారని ఇజ్రాయల్ మిలిటరీ పేర్కొంది. ఏ తరహా యుద్ధ విమానం అనేది మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ విమానంపై క్షిపణి ప్రయోగం జరిగిందని, అయితే విమాన సిబ్బంది ప్రామాణిక విధానాలను అనుసరించడం ద్వారా ముప్పును తప్పించారని, ఎలాంటి నష్టం లేకుండా మిషన్‌ను పూర్తి చేశారని 'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' పేర్కొంది. ఇరాన్ క్షిపణి అతి సమీపానికి రావడంతో పైలట్ వృత్తిపరమైన నైపుణ్యంతో అత్యంత వేగంగా స్పందించి దాడిని తప్పించినట్టు ఆ కథనం పేర్కొంది. విమానానికి నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం లేదు.


నతాంజ్ అణు కేంద్రంపై రెండోసారి దాడి

కాగా, ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఇటీవల దాడులు జరిపిన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు శనివారంనాడు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలు లీక్ అవ్వలేదని, పరిసర ప్రాంత నివాసితులకు ప్రమాదం వాటిల్లలేదని వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ నేరపూరిత చర్యల్లో భాగంగానే ఈదాడి జరిపిందని, అణుభద్రతా నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలకు తూట్లు పొడిచిందని నిప్పులు చెరిగింది.


ఇవి కూడా చదవండి..

నతాంజ్ అణు కేంద్రంపై దాడులు.. ఇరాన్ ఆగ్రహం..

కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ప్రకటించిన ఇరాన్

Updated Date - Mar 21 , 2026 | 07:49 PM