Venezuela Oil Tanker: వెనెజువెలా చమురు నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:55 PM
గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఎం/వీ బెల్లా-1 నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మెహరించింది.
వాషింగ్టన్: వెనెజువెలాపై ఇటీవల దాడి చేసి అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా తాజాగా ఆ దేశానికి చెందిన చమురు నౌకను స్వాధీనం చేసుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా అట్లాంటిక్‌లో నిలిచిపోయిన చమురు నౌకను రెండు వారాలుగా వెంబడించిన అమెరికా సైన్యం, తీరప్రాంత గస్తీదళం ఎట్టకేలకు దానిపైకి చేరుకుంది. ఈ విషయాన్ని అమెరికా సైన్యానికి చెందిన యూరోపియన్ కమాండ్ ధ్రువీకరించింది. అమెరికా ఆంక్షల ఉల్లంఘన కింద ఎం/వీ బెల్లా-1 చమురు నౌకను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. ఈ నౌకకు రక్షణగా రష్యా నౌకా దళాలను మోహరించినప్పటికీ తాజా పరిణామం చోటుచేసుకోవడం విశేషం.
గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఎం/వీ బెల్లా-1 నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మెహరించింది. అమెరికా కోస్ట్ గార్డుల నుంచి తప్పించుకుని నౌక అట్లాంటిక్‌లో తిరుగుతుండగా ఎట్టకేలకు అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
వెనెజువెలాతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను పటిష్టం చేసుకున్న రష్యా తరచు అమెరికా ఆంక్షలు చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ వచ్చింది. రష్యా ఫ్లాగ్ కింద నడుస్తున్న నౌకల విషయంలో జోక్యం సహించేమని హెచ్చరికలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలాలో మారణహోమం సృష్టించిన అమెరికా ఆపరేషన్..
ఇరాన్‌లో మరింత పెరిగిన నిరసనలు.. నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు..