Pakistan: పాకిస్థాన్‌లో లష్కరే, హమాస్ నాయకుల సమావేశం
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:18 PM
అమెరికా నిషేధించిన రెండు ఉగ్రవాద సంస్థలు ఒకేచోట సమవేశం కావడం సంచలనవుతుండగా, రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది.
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ నైజం మరోసారి బయటపడింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా (Lashkar-e-Taiba), హమాస్ (Hamas) నేతలు ఇటీవల పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో సమావేశమయ్యారు. పాకిస్థాన్ మర్కజే ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన ఈ సమావేశంలో హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్ (Naji Zaheer) ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. లష్కరే కమాండర్ రషీద్ అలీ సంధుతో జహీర్ భేటీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అమెరికా నిషేధించిన రెండు ఉగ్రవాద సంస్థలు ఒకేచోట సమవేశం కావడం సంచలనవుతుండగా, రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్‌తో జహీర్ సంబంధాలు
పాకిస్థాన్‌తో నాజీ జహీర్‌కు ఉన్న సంబంధాలు కొత్తవి కావు. 2025లో ఆయన పలువురు హమాస్ నేతలతో కలిసి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) వెళ్లాడు. ఇది పహల్గాం ఉగ్రదాడికి ముందు జరిగింది. పీఓకే పర్యటన సందర్భంగా భారత వ్యతిరేక ర్యాలీలో లష్కరే తయ్యిబా, జైషే మొహమ్మద్ కమాండర్లతో కలిసి జహీర్ పాల్గొన్నాడు. దీనికి ముందు 2024 జనవరిలో కరాచీని జహీర్ సందర్శించాడు. కరాచీ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడాడు. 2024 ఏప్రిల్‌లో ఇస్లామాబాద్ పర్యటించాడు. ఇస్లామాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సన్మానం అందుకున్నాడు. ఇవేకాకుండా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రదాడి జరిపిన తర్వాత వారం రోజులకు నాజీ జహీర్ పాకిస్థాన్‌కు వెళ్లాడు. జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం అధిపతి మౌలానా ఫజల్ ఉర్ రెహ్మాన్‌ను కలిశాడు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలాలో మారణహోమం సృష్టించిన అమెరికా ఆపరేషన్..
ఇరాన్‌లో మరింత పెరిగిన నిరసనలు.. నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు..