US Special Operation: వెనెజువెలాలో మారణహోమం సృష్టించిన అమెరికా ఆపరేషన్..
ABN , Publish Date - Jan 07 , 2026 | 07:37 AM
అమెరికా డెల్టా ఫోర్స్ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంది. అమెరికా సైన్యం దాడుల్లో పెద్ద మొత్తంలో వెనెజువెలా, క్యూబన్ సైనికులు చనిపోయారు.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా డెల్టా ఫోర్స్ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంది. అమెరికా సైన్యం దాడుల్లో పెద్ద మొత్తంలో వెనెజువెలా, క్యూబన్ సైనికులు చనిపోయారు. వెనెజువెలా స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అమెరికా దాడుల్లో 32 మంది క్యూబన్, 23 మంది వెనెజువెలా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 26 నుంచి 67 సంవత్సరాల వారు ఉన్నారు. ఇద్దరు కల్నల్స్, ఒక లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నారు. చనిపోయిన క్యూబన్స్‌లో మదురో సెక్యూరిటీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
అధ్యక్ష భవనంపై కాల్పులు
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్ చేసిన తర్వాత కూడా వెనెజువెలాలో పరిస్థితులు సాధారణ స్థిితిలోకి రావటం లేదు. సోమవారం రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం వద్ద భారీ కాల్పులు, పేలుళ్లు కలకలం రేపాయి. తాజాగా, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కారకాస్‌లోని అధ్యక్ష భవనంపై గుర్తు తెలియని డ్రోన్ సంచరించింది. దీనిని గమనించిన భద్రతా దళాలు డ్రోన్‌పై అటాక్ చేశాయి. భారీగా కాల్పులు జరిపాయి.
కోర్టుకు మదురో
తాజాగా నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా అధికారులు న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో మదురో తన వాదనలు వినిపించారు. తాను ఏ తప్పూ చేయలేదని, తనను కిడ్నాప్ చేశారని అన్నారు. మదురోపై ఉన్న నార్కో టెర్రరిజం ఆరోపణలను జడ్జి ఆల్విన్ హెల్లర్ స్టీన్ చదివి వినిపించారు. అందుకు మదురో సమాధానం ఇస్తూ.. తాను నిర్దోషినని, తనకు ఏమీ తెలియదని జవాబు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
సంక్రాంతి వేళ.. భారీగా బస్ చార్జీల పెంపు
టీమిండియాకు కోచ్‌గా ఉండటం అంత సులభం కాదు: హర్భజన్ సింగ్