Share News

అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:11 AM

అమెరికా ఫెడరల్‌ కోర్టు ఆ దేశంలో చదువుకొనే విదేశీ విద్యార్థులు, స్కాలర్లకు ఊరటనిచ్చే కీలక తీర్పును ఇచ్చింది

అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట
visa

  • విద్యార్థులు, జర్నలిస్టుల వీసాల గడువు తగ్గించేట్రంప్‌ సర్కారు ప్రతిపాదనను కొట్టేసిన ఫెడరల్‌ కోర్టు

  • అది వారికి విద్యావకాశాలను దక్కకుండా చేయడమేనన్న న్యాయమూర్తి డెనిస్‌ సేలర్‌

వాషింగ్టన్‌, నవంబరు 17 : అమెరికా ఫెడరల్‌ కోర్టు ఆ దేశంలో చదువుకొనే విదేశీ విద్యార్థులు, స్కాలర్లకు ఊరటనిచ్చే కీలక తీర్పును ఇచ్చింది. విదేశీ విద్యార్థులు, స్కాలర్లు, జర్నలిస్టులు తమ వీసాలపై అమెరికాలో ఉండే గడువును తగ్గిస్తూ ట్రంప్‌ యంత్రాంగం తీసుకువచ్చిన ఒక ప్రతిపాదనను కొట్టివేసింది. అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి దేశంలో ఉండకూడదని ఆ దేశ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) గత జూలైలో ఒక ప్రతిపాదన చేసింది. అయితే ఆ విధానం అమెరికన్‌ చట్టాలకు అనుగుణంగా లేదని బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టు జడ్జి సేలర్‌ సోమవారం తీర్పు చెప్పారు. కాగా, విదేశీ విద్యార్థులే కాకుండా విదేశీ జర్నలిస్టులు కూడా వారికి జారీ చేసే వీసాలపై ఏళ్ల తరబడి కాకుండా 240 రోజులు, చైనీస్‌ జర్నలిస్టులు అయితే 90 రోజుల వరకు మాత్రమే ఉండాలని డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదించింది. విదేశీ విద్యార్థులు తమ చదువులు పూర్తిచేసుకున్నాక, ఓపీటీ పూర్తయ్యాక ఉండేందుకు అనుమతించే గడువును కూడా 60 రోజుల నుంచి 30 రోజులకు పరిమితం చేయాలని ప్రతిపాదించింది.

ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి

గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా

Updated Date - Nov 18 , 2026 | 05:12 AM