Share News

అమెరికాకు బిగ్ షాక్.. కుప్పకూలిన యుద్ధ విమానం.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 02 , 2026 | 03:01 PM

గల్ఫ్ దేశాల్లో మూడోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్‌లో ఓ అమెరికా యుద్ధ విమానం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమెరికాకు బిగ్ షాక్.. కుప్పకూలిన యుద్ధ విమానం.. వీడియో వైరల్
US F15E crash Kuwait

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మూడో రోజు యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన, అధునాతన యుద్ధ విమానం ఒకటి కువైట్ లో కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. కువైట్ లో అమెరికాకు చెందిన ఫైట్ జెట్ ఎఫ్-15E స్ట్రైక్ ఈగిల్ కుప్పకూలింది.


కువైట్ గగనతలంలో ఉన్న ఆ యుద్ధ విమానం మంటల్లో చిక్కుకొని నేలపై కూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. ఆ జెట్‌ అమెరికా నుంచి వచ్చిందా..? ఇజ్రాయెల్ పంపిందా..? అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై కువైట్ రక్షణశాఖ ప్రకటన చేస్తూ.. పలు యూఎస్ మిలిటరీ విమానాలు కూలిపోయాయని వెల్లడించింది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి, వాటిల్లో ఉన్న సిబ్బందిని రక్షించామని పేర్కొంది. అయితే అవి కూలడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. సాంకేతిక లోపమా, నిర్వహణలో ఎదురైన సమస్యలా, లేక బయట నుంచి దాడి జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు సాగనుంది.


గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల పెరిగిన సైనిక చర్యల నేపథ్యంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించనున్నట్లు కువైట్ ప్రభుత్వం తెలిపింది. ఎఫ్-15E యుద్ధ విమానం గగనతల ఆధిపత్యం, భూమిపై అనుకున్న లక్ష్యాలను కచ్చితంగా చేరుకునే అత్యాధునికి సామర్థ్యాలను కలిగి ఉంది. ఇటీవల అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ ప్రాంతాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేస్తుంది. అయితే కువైట్ గగనతల రక్షణ వ్యవస్థ అనేక దాడులను అడ్డుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.


ఇవి కూడా చదవండి:

యుద్ధం ఎఫెక్ట్.. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుందా?

గరికపాటి సలహాలు మాకు అవసరం లేదు.. కమలానంద భారతి ధ్వజం

Updated Date - Mar 02 , 2026 | 03:06 PM