Share News

ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్‌కు సిద్ధం!

ABN , Publish Date - Mar 03 , 2026 | 02:41 PM

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌పై ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్‌కు సిద్ధమైందని సమాచారం.

ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్‌కు సిద్ధం!
US Congress vote

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఇదే సమయంలో ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్‌లోని కీలక స్థావరాలను అమెరికా ధ్వంసం చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌పై ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


వార్ పవర్స్ యాక్ట్(War Powers Act) ప్రకారం అధ్యక్షుడి అధికారాలపై పరిమితులు ఉన్న విషయాన్ని అమెరికా కాంగ్రెస్ గుర్తు చేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా విదేశాలకు సైన్యం పంపరాదని వార్ పవర్స్ యాక్ట్ చెబుతుందని యూఎస్ఏ ముఖ్యనేతలు చెబుతున్నారు. సైన్యం వినియోగంపై 48 గంటల్లోకాంగ్రెస్‌కు సమాచారం ఇవ్వాలని వార్ పవర్స్ యాక్ట్ చెబుతుంది. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమని డెమోక్రాట్ల ఆరోపణలు చేస్తున్నారు. వారి వాదనలపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ నుంచి తక్షణ ముప్పు ఉందని వెల్లడించారు. ఇరాన్‌పై దాడులు కేవలం వైమానిక చర్యలేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో పౌర మృతులు 550 దాటినట్లు సమాచారం.


మరోవైపు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖమేనీని మట్టుబెట్టడం వెనక కొన్నేళ్ళ ఆపరేషన్ ఉందని సమాచారం. ఖమేని ఆఫీస్‌కు దగ్గర్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలను మొబైల్ నెట్‌వర్క్‌లను అమెరికా, ఇజ్రాయెల్ హ్యాక్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ అధ్యక్ష భవనం దగ్గర భద్రతా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులు, మిలటరీ అధికారులను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ట్రాక్ చేసింది. వారు వచ్చిపోయే సమయాలపై నిరంతరం నిఘా ఉంచినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

టీ20 డబ్ల్యూసీలో ఇప్పటికీ భారత్ ఫేవరెట్ కాదు: పాక్ మాజీ పేసర్

భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్, జింబాంబ్వే క్రికెట్ జట్లు

Updated Date - Mar 03 , 2026 | 03:25 PM