Share News

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు దాడులు.. ఇరాన్ నగరాలపై బాంబుల వర్షం..

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:15 PM

ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయంగా కాస్త ఉపశమనం నెలకొంది. పలు దేశాలు స్టాక్ మార్కెట్లు, బంగారం ధరలు, చమురు ధరలు కోలుకున్నాయి.

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు దాడులు.. ఇరాన్ నగరాలపై బాంబుల వర్షం..
Trump peace claims Iran

ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయంగా కాస్త ఉపశమనం నెలకొంది. పలు దేశాల స్టాక్ మార్కెట్లు లాభాలు ఆర్జించాయి. చమురు ధరలు తగ్గాయి. యుద్దం విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినా ఇరాన్‌పై దాడులు మాత్రం ఆగడం లేదు (Trump peace claims Iran).


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ నగరాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి ఇరాన్‌లోని పలు నగరాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు సంభవించాయి. తబ్రిజ్, ఇస్ఫహాన్, కరాజ్ నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇస్ఫహాన్‌లోని గ్యాస్ వ్యవస్థ, ఖొర్రమ్‌షహర్‌లోని పవర్ ప్లాంట్‌లను క్షిపణులు, డ్రోన్లు తాకాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ చేసి ఉంటుందని ఇరాన్ భావిస్తోంది. ఈ దాడులపై అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు (US Israel strikes Iran).


మరోవైపు ఇజ్రాయెల్‌పై 78వ విడత దాడులను ప్రారంభించినట్టు ఐఆర్‌జీసీ తాజాగా ప్రకటించింది (Middle East war updates). ఇజ్రాయె‌లోని టెల్ అవివ్, డిమోనా, ఇలాట్‌తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు తెలిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన పలు ప్రాంతాలు ధ్వంసమైనట్టు పేర్కొంది. మంగళవారం ఉదయం నుంచి పలు ఇజ్రాయెల్‌ నగరాల్లో సైరన్ల మోత మోగుతోంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. రంగంలోకి సౌదీ అరేబియా, యూఏఈ..


వరుస నష్టాలకు బ్రేక్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Mar 24 , 2026 | 04:19 PM