ఇరాన్ యుద్ధం.. రంగంలోకి సౌదీ అరేబియా, యూఏఈ..
ABN , Publish Date - Mar 24 , 2026 | 03:13 PM
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేయడంతో ప్రపంచ దేశాలు కాస్త ఉపశమనం పొందాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ కథనం సంచలనంగా మారింది.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేయడంతో ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం లభించింది. ఇలాంటి తరుణంలో ప్రముఖ 'వాల్‌స్ట్రీట్' జర్నల్ ప్రచురించిన ఓ కథనం సంచలనంగా మారింది. ఇరాన్‌తో అమెరికా సాగిస్తున్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్టు 'వాల్‌స్ట్రీట్' జర్నల్ పేర్కొంది (Saudi Arabia UAE war).
తమ వైమానిక స్థావరాల నుంచి ఇరాన్‌పై దాడులు చేయడానికి ఇప్పటివరకు అమెరికాకు అనుమతి ఇవ్వని సౌదీ అరేబియా.. తాజాగా మనసు మార్చుకున్నట్టు ఆ కథనం పేర్కొంది. తమ వైమానిక స్థావరాల నుంచి ఇరాన్‌పై దాడులు చేసేందుకు అగ్రరాజ్యానికి సౌదీ అరేబియా అనుమతినిచ్చిందట. మరోవైపు, తమ దేశంలోని ఇరాన్‌కు చెందిన ఓ హాస్పిటల్‌ను, క్లబ్‌ను యూఏఈ మూసేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే అమెరికాకు సౌదీ అరేబియా, యూఏఈ ప్రత్యక్షంగా సహకరించేందుకు ముందుకు వస్తున్నట్టు అర్థమవుతోందని 'వాల్‌స్ట్రీట్' పేర్కొంది (US Israel Iran conflict).
పశ్చిమాసియాలో సుదీర్ఘంగా జరుగుతున్న యుద్ధం వల్ల తమ ఆర్థిక వ్యవస్థలు భారీగా నష్టపోతున్నాయని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి (Strait of Hormuz crisis). చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు మద్దతు ఇచ్చి హోర్ముజ్ జలసంధిపై ఆటంకాలు త్వరగా తొలిగిపోయేలా చేయాలని భావిస్తున్నాయట. అయితే ఈ వార్తలపై అమెరికా నుంచి ఇప్పటివరకు స్పందన లేదు.
ఇవీ చదవండి:
యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు