Share News

వరుస నష్టాలకు బ్రేక్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

ABN , Publish Date - Mar 24 , 2026 | 03:55 PM

ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో జోష్ తీసుకొచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది.

వరుస నష్టాలకు బ్రేక్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..
Stock Market

ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో జోష్ తీసుకొచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది. మరోవైపు కనిష్ఠాల వద్ద మదుపర్లు ఆసక్తి చూపించడం, అంతర్జాతీయ మార్కెట్లు లాభాలు ఆర్జించడం దేశీయ సూచీలకు పాజిటివ్‌గా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (72,696)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 1500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం సమయంలో కాస్త కిందకు వచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. చివరకు సెన్సెక్స్ 1372 పాయింట్ల లాభంతో 74,068 వద్ద రోజును ముగించింది. మళ్లీ 74 వేలకు పైన ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 399 పాయింట్ల లాభంతో 22,912 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే కదలాడాయి (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో సమ్మన్ క్యాపిటల్, హిందుస్థాన్ పెట్రో, లార్సన్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లాభాలు ఆర్జించాయి (share market news). కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా పవర్, సన్ ఫార్మా మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1167 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1369 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.87గా ఉంది.


ఇవీ చదవండి:

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 24 , 2026 | 03:55 PM