Share News

ఇంధన సంక్షోభం వేళ యూఏఈ సంచలన నిర్ణయం..

ABN , Publish Date - Apr 28 , 2026 | 08:44 PM

అమెరికా/ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ఎఫెక్ట్‌తో ఇంధన సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్ (OPEC) కూటమితో పాటు ఒపెక్ ప్లస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

ఇంధన సంక్షోభం వేళ యూఏఈ సంచలన నిర్ణయం..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా/ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ఎఫెక్ట్‌తో ఇంధన సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. OPEC (Organization of the Petroleum Exporting Countries) కూటమితో పాటు OPEC ప్లస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డబ్ల్యూఏఎమ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇది యూఏఈ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని ఆ వార్తా సంస్థ పేర్కొంది.


OPEC నుంచి యూఏఈ వైదొలగడం సౌదీకి పెద్ద ఎదురు దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా అరబ్ దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలను కూడా ఇది సూచిస్తుందని అంటున్నారు. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల నేపథ్యంలో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మొండుగా ఉండనున్నాయనే చర్చ నడుస్తోంది.


1967లో ఒపెక్‌లో యూఏఈ సభ్య దేశంగా చేరింది. సౌదీ అరేబియా, ఇరాన్ తర్వాత అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా యూఏఈ ఉంది. అలాగే OPEC నిర్ణయాల్లో యూఏఈ అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సభ్య దేశంగా కొనసాగిన యూఏఈ.. ఇలా అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటన్నది వెల్లడించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తరాంధ్రలో రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి: మంత్రి నిమ్మల

వైసీపీ.. భయాందోళన పరిస్థితులు సృష్టిస్తోంది: మంత్రి పార్థసారథి

For More International News And Telugu News

Updated Date - Apr 28 , 2026 | 09:26 PM