Share News

సంతాప సభలో ఇదేం తీరు.. ట్రంప్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు..

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:44 AM

అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ స్మారక సభలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది.

సంతాప సభలో ఇదేం తీరు.. ట్రంప్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు..
Trump Viral Video

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ స్మారక సభలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది. వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్‌లో జరిగిన గ్రాహమ్ సంతాప సభకు ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు (Donald Trump Tic Tac Moment).


సంతాప సభలో ముందు వరుసలో ట్రంప్, జేడీ వాన్స్ పక్కపక్కనే కూర్చున్నారు. ఆ సమయంలో ట్రంప్ తన జేబులో నుంచి టిక్ టాక్ మింట్ బాక్స్ తీసి జేడీ వాన్స్‌కు చూపిస్తూ నవ్వుకున్నారు. ఆ తర్వాత ఒక టిక్ టాక్‌ను నోటిలో వేసుకున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'సంతాప సభలో ఇలా నవ్వుతూ మాట్లాడటమా? ఇది సినిమా థియేటర్ కాదు' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు (Lindsey Graham Memorial).


కాగా, ట్రంప్ తన ప్రసంగంలో లిండ్సే గ్రాహమ్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కొన్ని హాస్య సంఘటనలను కూడా ప్రస్తావించారు (Trump Viral Video). 2016లో ఇద్దరి మధ్యన రాజకీయ విభేదాలు, అనంతరం ఏర్పడిన స్నేహాన్ని గుర్తు చేస్తూ సభికులను నవ్వించారు. గ్రాహమ్‌ను 'అమెరికా రాజకీయాల్లో అరుదైన నాయకుడు'గా అభివర్ణించారు. జూలై 11న గుండె సంబంధిత సమస్యతో లిండ్సే గ్రాహమ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌..


స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 29 , 2026 | 11:55 AM