ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ ఒకేచోట
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:27 AM
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది.
ఏపీఈసీ సదస్సు కోసం చైనాకు చేరుకున్న అమెరికా, రష్యా అధ్యక్షులు
షెన్‌జెన్(చైనా), నవంబరు 18: ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే వేదికను పంచుకున్నారు. చైనాలోని షెన్‌జెన్ నగరంలో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార(ఏపీఈసీ) సదస్సు కోసం ట్రంప్, పుతిన్ చైనా చేరుకున్నారు. ఏపీఈసీ సదస్సు గురువారం జరగనుంది. ఈ సందర్భంగా ఈ ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక సమావేశం ఉండనుంది. ఏపీఈసీ సదస్సు కోసం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బుధవారం షెన్‌జెన్ చేరుకున్న ట్రంప్‌ను జిన్‌పింగ్ విమానాశ్రయంలోనే స్వాగతించారు. చైనా అధ్యక్షుడు ఇలా మరో దేశ అధ్యక్షుడిని స్వాగతించడం 70ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ట్రంప్ కంటే ముందుగానే షెన్‌జెన్ చేరుకున్న పుతిన్‌ను చైనా ఉన్నతాధికారులు స్వాగతించారు. ఇక, బుధవారం సాయంత్రం జరిగిన ఏపీఈసీ సదస్సు స్వాగత కార్యక్రమంలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కాసేపు ముచ్చటించారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు