Share News

కెనడాపై 100 శాతం సుంకాలు.. ట్రంప్ హెచ్చరిక

ABN , Publish Date - Jan 24 , 2026 | 09:21 PM

చైనాతో వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్లాలని కెనడా అనుకుంటే ఆ దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

కెనడాపై 100 శాతం సుంకాలు.. ట్రంప్ హెచ్చరిక
Donald trump with Mark Carney

వాషింగ్టన్: కెనడా (Candada)పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాతో వ్యాపారం చేసేందుకు ఆ దేశం మొగ్గుచూపడాన్ని తప్పుపట్టారు. చైనాతో వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్లాలని కెనడా అనుకుంటే ఆ దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని కెనడా వ్యతిరేకిస్తుండటంపై కూడా ఆదేశ ప్రధాని మార్క్ కార్నేపై ట్రంప్ విరుచుకుపడ్డారు.


డ్రాగెన్ మింగేస్తుంది జాగ్రత్త..

'గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి ఆ గోల్డెన్ డోమ్ కెనడాకు రక్షణ కల్పిస్తుంది. ఇందుకు భిన్నంగా చైనాతో వ్యాపారానికి కెనడా మొగ్గుచూపితే ఏడాదిలోపే ఆ దేశాన్ని డాగ్రెన్ సజీవంగా మింగేస్తుంది. కెనడా వాణిజ్యాన్ని నాశనం చేస్తుంది, సోషల్ కట్టుబాట్లు, జీవనవిధానాన్ని సైతం దెబ్బతీస్తుంది' అని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా కెనడాను హెచ్చరించారు.


చైనాతో కొత్త వాణిజ్యం ఒప్పందం జరిగిందని ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశానంతరం కార్నీ ఇటీవల ప్రకటించారు. కనోలా సీడ్స్‌కు చైనాలో మంచి మార్కెట్ ఉందని, వీటిపై ప్రస్తుతం విధిస్తున్న 84 శాతం సుంకాన్ని మార్చి 1 నుంచి 15 శాతానికి చైనా తగ్గించనుందని తెలిపారు. కాగా, కెనడా విజిటర్లను వీసా లేకుండా తమ దేశంలోకి అనుమతించేందుకు చైనా అంగీకరించింది. ఇందుకు ప్రతిగా 49,000 చైనా ఎలక్ట్రిక్ వాహనాలను 6.1 శాతం టారిఫ్‌తో కెనడా దిగుమతి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో చైనాతో కెనడా వ్యాపారంపై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ భద్రతా వ్యవస్థను కాదని చైనాతో వ్యాపారం చేస్తే కెనడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..

భారత్‌కు గుడ్ న్యూస్.. హింట్ ఇచ్చిన అమెరికా

Updated Date - Jan 24 , 2026 | 09:30 PM