ఇరాన్‌తో ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప నెతన్యాహుకు మరో మార్గం లేదు: ట్రంప్
ABN , Publish Date - Jun 08 , 2026 | 07:33 AM
ఇరాన్‌తో అమెరికా జరిపే ఎలాంటి ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించక తప్పదని, ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్, జూన్ 8: ఇరాన్‌తో అమెరికా జరిపే ఎలాంటి ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించక తప్పదని, ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'నెతన్యాహుకు వేరే ఛాయిస్ లేదు. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది నేను మాత్రమే. అన్ని విషయాల్లోనూ నాదే తుది నిర్ణయం, నెతన్యాహుది కాదు'. అని ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు, ఇరాన్‌తో చర్చలు జరపాలనే తన నిర్ణయాన్ని మార్చలేవని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడుల వల్ల అమెరికా-ఇరాన్ చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ ప్రారంభంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి:
దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి పెట్టాము: ఎల్ఐసీ సీఈఓ
ఆచితూచి అడుగేయండి.. ఇన్వెస్టర్లకు నిపుణులు సూచన