ఆచితూచి అడుగేయండి..!
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:32 AM
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ వారం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టాలి. ప్రణాళిక లేకుండా కొనుగోళ్లు చేపట్టక పోవటం...
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ వారం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టాలి. ప్రణాళిక లేకుండా కొనుగోళ్లు చేపట్టక పోవటం మంచిది. యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. రూపాయి బలోపేతానికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.
స్టాక్ రికమండేషన్స్
ఆర్‌ఈసీ లిమిటెడ్: రెండేళ్లుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లోనే సాగుతోంది. జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 51 శాతం దిద్దుబాటుకు లోనయ్యాయి. ప్రస్తుతం ఈ కౌంటర్‌లో అమ్మకాల ఒత్తిడి పూర్తయినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ షేరు రూ.330 స్థాయిలో కన్సాలిడేట్ అవుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.343 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.335 స్థాయిలో ప్రవేశించి రూ.375 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.325 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
అదానీ గ్రీన్ ఎనర్జీ: ప్రస్తుతం ఈ షేరు సెకండ్ స్టేజ్‌లో ఉంది. షేరు ధర అన్ని మూవింగ్ యావరేజె్‌సకు పైన కదలాడుతోంది. చివరి మూడు నెలల్లో 92 శాతం మేర పెరిగింది. నిఫ్టీతో పోల్చితే జోరు ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.1,525 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,500 శ్రేణిలో ఎంటరై రూ.1,575 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,480 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హిందుస్థాన్ యూనీలివర్: కొన్ని నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో రేంజ్ బౌండ్‌లోనే కదలాడుతోంది. సైడ్‌వే్‌సలో చలిస్తోంది. మరోసారి రూ.2,050 వద్ద మద్దతు తీసుకోవటం, భారీ వాల్యూమ్ నమోదవటంతో దీనిపై ఆసక్తి పెంచుతోంది. గత శుక్రవారం రూ.2,121 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.2,100 వద్ద పొజిషన్ తీసుకుని రూ.2,350 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,060 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కెనరా బ్యాంక్: గత ఏడాది మార్చి నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు జీవితకాల గరిష్ఠం నుంచి 23 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం అమ్మకాల ఒత్తిడి తగ్గింది. రూ.130 శ్రేణిలో స్థిరంగా కొనసాగుతోంది. గత శుక్రవారం రూ.135 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.130 శ్రేణిలో ప్రవేశించి రూ.165 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.126 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
పీఎ్‌ఫసీ: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. రూ.486 వద్ద తాజా గరిష్ఠాన్ని నమోదు చేసిన తర్వాత కాస్త దిద్దుబాటుకు లోనైంది. ఇప్పుడు 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని పుంజుకుంది. మొత్తంగా ఈ ఏడాది 25 శాతం మేర రాబడిని అందించింది. గత శుక్రవారం రూ.431 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.420 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.470 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.415 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలనూ చదవండి:
ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..