Share News

లేదు.. లేదంటూనే.. చైనాకు 8.79 లక్షల ఏఐ చిప్‌లు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:11 AM

పైకి చైనాతో సై అంటే సై అంటూనే ఆ దేశంతో ట్రంప్‌ యంత్రాంగం సహకరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది

లేదు.. లేదంటూనే.. చైనాకు   8.79 లక్షల ఏఐ చిప్‌లు!
trump

  • జాతీయ భద్రత, చైనాపై ఆంక్షలు

  • అంటూనే సరఫరాకు ట్రంప్‌ అనుమతి

వాషింగ్టన్‌, నవంబరు 20: పైకి చైనాతో సై అంటే సై అంటూనే ఆ దేశంతో ట్రంప్‌ యంత్రాంగం సహకరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చైనాను టెక్నాలజీ రంగంలో కట్టడి చేసేందుకు, అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదకరమంటూ ఏఐ (కృత్రిమ మేధ) చిప్‌ల ఎగుమతులపై నియంత్రణలు విధిస్తున్నట్టు ట్రంప్‌ గత రెండేళ్లలో పలుమార్లు ప్రకటించారు. కానీ 2025 డిసెంబరు నుంచి 2026 మే వరకు కేవలం 7నెలల కాలంలోనే చైనా టెక్‌ దిగ్గజాలకు.. ఎన్విడియా, ఏఎండీ సంస్థలు 8.79 లక్షల అధునాతన ఏఐ చిప్‌లను చైనాకు విక్రయించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం అనుమతించింది. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ బ్రయాన్‌ మాస్ట్‌ ఈ వివరాలు బయటపెట్టారు. 34 లక్షల చిప్‌లు విక్రయించేందుకు సంస్థలు అనుమతి కోరగా 8.79 లక్షల చిప్‌లు ఎగుమతి చేసేందుకు అనుమతించారన్నారు. ఇలా చిప్‌ల కొనుగోలుకు అనుమతి పొందిన పలు సంస్థలకు చైనా సైన్యంతో సంబంధాలున్నవిగా అమెరికా రక్షణశాఖ గుర్తించింది. అయితే అనుమతించిన వాటిలో ఎన్ని చిప్‌లు ఇప్పటివరకు చైనాకు చేరాయన్న దానిపై స్పష్టత లేదు.

ఇవి కూడా చదవండి..

ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 03:14 AM