నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు..
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:24 PM
టిబెట్-నేపాల్ సరిహద్దులో ప్రకృతి విపత్తులు విలయతాండవం చేస్తున్నాయి. భారీ వరదలకు ఇప్పటివరకు 469 మంది మృతిచెందగా.. 1,500 మందికి పైగా గల్లంతయ్యారు. ఇలాంటి వేళ చైనా ప్రభుత్వం మరో బాంబులాంటి వార్తను తెలియజేసింది.
బీజింగ్: టిబెట్-నేపాల్ సరిహద్దులో ప్రకృతి విపత్తులు విలయతాండవం చేస్తున్నాయి. నేపాల్ సరిహద్దులోని రసువా నుంచి టిబెట్‌లోని గ్యిరాంగ్ ప్రాంతాల మధ్య వరదలు సంభవించి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 469 మంది మృతిచెందగా.. 1,500 మందికి పైగా గల్లంతయ్యారు. ఇలాంటి వేళ చైనా ప్రభుత్వం మరో బాంబులాంటి వార్తను తెలియజేసింది. కొండచరియల శిథిలాలతో ఏర్పడిన సరస్సు ఎగువ ప్రాంతంలో నీటిమట్టం పెరుగుతుండటంతో మరోసారి భారీ వరద ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో టిబెట్ వైపు కొనసాగుతున్న సహాయక, గాలింపు చర్యలను చైనా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
కాగా, నేపాల్-టిబెట్ సరిహద్దులోని గ్యిరాంగ్ ప్రాంతంలో వర్షాలకు కొండచరియలు విరిగిపడి భారీగా మట్టి, రాళ్లు నదీ ప్రవాహాల్లోకి చేరాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి తాత్కాలిక సరస్సులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ సరస్సుల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. సరస్సుల కట్ట తెగితే భారీ స్థాయిలో నీరు దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే మరో భారీ విపత్తు సంభవించనుంది. ఈ కారణంగానే చైనా అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేపాల్ వరదలు.. 469కి చేరిన మృతుల సంఖ్య.. 1500 మంది మిస్సింగ్..