నేపాల్ వరదలు.. 469కి చేరిన మృతుల సంఖ్య.. 1500 మంది మిస్సింగ్..
ABN , Publish Date - Aug 28 , 2026 | 09:29 AM
నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 469కి చేరింది. దాదాపు 1550 మంది ఆచూకీ లభించలేదు.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 469కి చేరింది. దాదాపు 1550 మంది ఆచూకీ లభించలేదు. భారత దేశానికి చెందిన 178 మంది వరదల్లో గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు తాజాగా వెల్లడించింది. వరదల్లో గల్లంతైన విదేశీయులలో భారతీయులే అధికంగా ఉన్నారని తెలిపింది.
నేపాల్‌కు చైనా హెచ్చరిక..
చైనాకు చెందిన 'మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్' నేపాల్‌కు లెవెల్ ఫోర్ హెచ్చరికలు జారీ చేసింది. టిబెట్ - నేపాల్ బార్డర్‌లో మరిన్ని వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం వచ్చిన వరదల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదుల సంగమ ప్రాంతంలో అడ్డంగా పడ్డాయని వెల్లడించింది.
నదుల ప్రవాహం ఆగిపోవడంతో అక్కడ ఒక కృత్రిమ సరస్సు ఏర్పడిందని, అందులో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరిందని తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ నీటి మట్టం మరింత పెరిగి, రాబోయే 72 గంటల్లో ఆ తాత్కాలిక డ్యామ్ బద్దలయ్యే ప్రమాదం ఉందని చైనా హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి