టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు..
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:23 AM
చైనా ఆధీనంలోని టిబెట్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు భారీ ప్రభావాన్ని చూపించాయి.
ఇంటర్నెట్ డెస్క్: చైనా ఆధీనంలోని టిబెట్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు భారీ ప్రభావాన్ని చూపించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది గాయపడినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం (Tibet earthquake).
టిబెట్‌లోని ఉత్తర ప్రాంతమైన నాగ్కు నగర పరిధిలో ఈ భూకంపం సంభవించింది. గురువారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 10.33 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చైనా భూకంప పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి ఈ ప్రాంతం సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం కారణంగా నాగ్కు ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది (7.0 magnitude earthquake).
నాగ్కు ప్రాంతంలో కనీసం 339 ఇళ్లు, 20 పశువుల కొట్టాలు దెబ్బతిన్నాయి (Tibet rescue operations). కొన్ని గ్రామాల్లో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప బాధితులను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. స్థానికంగా 1,600 మందికి పైగా సిబ్బందిని సహాయక చర్యల్లో భాగస్వాములను చేశారు. బాధితుల కోసం తాత్కాలిక నివాసాలు, గుడారాలు, పడకలు, చలిని తట్టుకునేందుకు అవసరమైన దుస్తులను అందిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి: