సమన్వయంతో పనిచేయండి : సీఎండీ
ABN , First Publish Date - 2023-07-17T00:02:20+05:30 IST
ఏపీ ఎస్పీడీసీఎల్, ట్రాన్సకో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీ ఎండీ సంతోష్‌రావు సూచించారు.
అనంతపురంరూరల్, జూలై 16: ఏపీ ఎస్పీడీసీఎల్, ట్రాన్సకో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీ ఎండీ సంతోష్‌రావు సూచించారు. ఆదివారం సాయంత్రం జేఎనటీయూ రోడ్డులోని ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత శాఖ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని ట్రాన్సకో, ఎస్పీడీసీఎల్ విద్యుత ఎస్‌ఈలు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాటా ్లడారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే మంచి ఫలితాలు సాధ్యమన్నారు. రైతులకు కోతలులేని విద్యుత సరఫరాకు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సిజిఎం గురవయ్య, ఎస్‌ఈ సురేంద్ర, ట్రాన్సకో ఎస్‌ఈ కరుణాకర్, ఈఈలు పాల్గొన్నారు.