6 ఏళ్ల చిన్నారి 'టాయిలెట్ బ్రేక్'.. విమాన ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన అనూహ్య ఘటన!
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:54 PM
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న 'ఫ్లైదుబాయ్' విమానంలో ఊహించని రీతిలో మిడ్‌ఎయిర్ డిజాస్టర్ తృప్తిలో తప్పింది. అయితే, ఈ విమానం సురక్షితంగా బయటపడటంలో ఓ 6 ఏళ్ల చిన్నారి టాయిలెట్‌కి వెళ్లడం ఒక కీలక మలుపుగా మారింది.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 10: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న 'ఫ్లైదుబాయ్' విమానాకి ఊహించని రీతిలో మిడ్‌ఎయిర్ డిజాస్టర్ తృప్తిలో తప్పిపోయింది. కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ఘోరమైన దాడి నుంచి విమానం సురక్షితంగా బయటపడటంలో ఓ 6 ఏళ్ల చిన్నారి టాయిలెట్‌కి వెళ్లడం ఒక కీలక మలుపుగా మారింది.
'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం, ప్రయాణికుడు త్స్వికా మాన్స్ తన 6 ఏళ్ల కుమార్తె నినాతో కలిసి విమానం ముందు వరుసలో ప్రయాణిస్తున్నాడు. చిన్నారి నినా టాయిలెట్‌లో ఉన్న సమయంలో కాక్‌పిట్ వైపు నుంచి ఒక్కసారిగా భయానక అరుపులు వినిపించాయి. టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన చిన్నారి 'నాన్నా.. మనం చనిపోకూడదు' అంటూ భయంతో కేకలు వేయడంతో మాన్స్ వెంటనే కాక్‌పిట్ వైపు పరుగెత్తాడు.
మాన్స్ కాక్‌పిట్ వద్దకు వెళ్లేసరికి తలుపు పాక్షికంగా తెరచుకుని ఉంది. తీవ్రమైన గాయాలతో రక్తం ఓడుతున్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్ (Smit Machchhar), దాడికి పాల్పడుతున్న ఒమానీ కో-పైలట్‌తో పోరాడుతూ బయటకు వచ్చాడు. కో-పైలట్ ఆయనపై దాడి చేస్తూ కత్తితో పొడుస్తున్నాడు. తీవ్ర గాయాలైనప్పటికీ, తన ప్రాణాలను కాపాడుకోవడానికి, సహాయం కోసం పైలట్ స్మిత్ ఎలాగోలా కాక్‌పిట్ తలుపులు తెరవగలిగారు.
సమయస్ఫూర్తితో స్పందించిన మాన్స్, మరో ఇద్దరు ప్రయాణికులు (ఆసఫ్ రాజువాన్, యానివ్ హయున్) వెంటనే ఆ దాడి చేస్తున్న కో-పైలట్‌పైకి దూకారు. తీవ్రంగా శ్రమించి అతడిని కిందకు లాగి, విమానంలోని హెడ్‌ఫోన్ కేబుళ్లతో కట్టేశారు.
ఈ పరిణామాల మధ్య విమానం ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు. అయితే, విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు వెంటనే కాక్‌పిట్ బాధ్యతలను స్వీకరించి విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని 'తబుక్' (Tabuk) విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
హనుమాన్ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్నా.. మోదీతో కెప్టెన్ స్మిత్..
2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు: SP, కాంగ్రెస్ మధ్య సీట్ల బేరాలు