భారత్‌తో కాల్పుల విరమణ.. ట్రంప్‌ను శాంతిదూతగా కొనియాడిన పాక్ ప్రధాని..
ABN , Publish Date - Jun 06 , 2026 | 08:26 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి దూత అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసించారు. ఏడాది క్రితం భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందంలో ఆయనదే కీలక ప్రాత అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి దూత అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసించారు. ఏడాది క్రితం భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందంలో ఆయనదే కీలక ప్రాత అని పేర్కొన్నారు. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పట్ల పాకిస్థాన్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు (Shehbaz Sharif praises Donald Trump).
గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా పాకిస్థాన్‌లోని సైనిక, మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. చివరకు మే 10వ తేదీన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది (India Pakistan ceasefire).
కాల్పుల విరమణ అమలులోకి రావడానికి ట్రంప్ తీసుకున్న సమయోచిత, నిర్ణయాత్మక జోక్యమే కారణమని షరీఫ్ పేర్కొన్నారు (US Pakistan relations). దక్షిణాసియాలో శాంతి పునరుద్ధరణకు ట్రంప్ చేసిన కృషిని పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు. ట్రంప్ పట్ల పాకిస్థాన్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
నార్వేలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..