అమెరికాలో మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ఎస్‌బీఐ చైర్మన్
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:08 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అమెరికా డాలస్ సమీపంలోని అర్వింగ్‌లో ఉన్న మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి నివాళులర్పించారు
(డాలస్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు గోకుల్ కృష్ణ): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అమెరికా డాలస్ సమీపంలోని అర్వింగ్‌లో ఉన్న మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి నివాళులర్పించారు. ఫ్రిస్కో నగరంలో ఇటీవలే ఎస్‌బీఐ బ్రాంచిని ఏర్పాటు చేయడంతో ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. మహాత్ముడికిఅగ్రరాజ్యంలో అతిపెద్ద స్మారక స్థలిని రూపొందించిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో స్మారక స్థలి కమిటీ ఛైర్మన్ డా.ప్రసాద్ తోటకూర, వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వల, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు మహేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు