Share News

హౌతీల డ్రోన్లను ధ్వంసం చేశాం.. సౌదీ బలగాల ప్రకటన

ABN , Publish Date - Oct 27 , 2026 | 10:18 AM

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. సౌదీ అరేబియాలోని రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేశామని సౌదీ నేతృత్వంలోని బలగాలు మంగళవారం ప్రకటించాయి.

హౌతీల డ్రోన్లను ధ్వంసం చేశాం.. సౌదీ బలగాల ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. సౌదీ అరేబియాలోని రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేశామని సౌదీ నేతృత్వంలోని బలగాలు మంగళవారం ప్రకటించాయి. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతం వైపు బాలిస్టిక్ క్షిపణులను, దక్షిణ ప్రాంతం వైపు నాలుగు డ్రోన్లను హౌతీలు ప్రయోగించారని బలగాలు తెలిపాయి. తూర్పు ప్రాంతంతో పాటు ఖర్జ్ గవర్నరేట్‌లో హౌతీల నుంచి ముప్పు పొంచి ఉందని, వారు దాడి చేయవచ్చని సౌదీ పౌర రక్షణ విభాగం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం ఆయా ప్రాంతాల్లో ముప్పు తొలగిపోయిందని ప్రకటించింది.


కాగా.. గత నెలలో యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రదేశాలను హౌతీలు స్వాధీనం చేసుకుని బాబ్ అల్ మందెబ్ జలసంధి వైపు ప్రయాణించారు. అప్పటి నుంచి హౌతీలపై సౌదీ అరేబియా దాడులను తీవ్రం చేసింది. హోర్ముజ్ జలసంధికి అవతలివైపు ఉన్న గల్ఫ్ చమురు ఉత్పత్తి దేశాలకు అంతర్జాతీయ సముద్ర రవాణాలో ఈ జలసంధి అత్యంత కీలకమైనది. 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తాజా ఉద్రిక్తతలతో దెబ్బతింది. అంతకుముందు ఈ ఒప్పందంతో యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు, సనాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హౌతీలకు మధ్య దాడులు చాలా వరకు నిలిచిపోయాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

Updated Date - Oct 27 , 2026 | 12:28 PM