మరోసారి పాకిస్థాన్‌ను ఆదుకున్న సౌదీ అరేబియా.. మూడు బిలియన్ డాలర్ల సహాయం..
ABN , Publish Date - Apr 15 , 2026 | 07:07 PM
తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా మరోసారి అండగా నిలిచింది. తాజాగా 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 వేల కోట్లు) అదనపు ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్న వేళ సౌదీ ముందుకు వచ్చి ఆదుకుంది.
తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా మరోసారి అండగా నిలిచింది. తాజాగా 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 వేల కోట్లు) అదనపు ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్న వేళ సౌదీ ముందుకు వచ్చి ఆదుకుంది. రాబోయే వారం రోజుల్లో ఈ నిధులు విడుదలయ్యే అవకాశమున్నట్టు పాక్ ఆర్థిక శాఖ వెల్లడించింది (Saudi Arabia Pakistan aid).
యూఏఈ నుంచి గతంలో తీసుకున్న రుణంలో దాదాపు 3.5 బిలియన్ డాలర్లను పాక్ ఈ నెలలో తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో విదేశీ మారక నిల్వల విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటువంటి కీలక సమయంలో సౌదీ నుంచి పాక్‌కు ఆర్థిక భరోసా లభించింది. అంతేకాదు, గతంలో సౌదీ నుంచి పాక్ తీసుకున్న ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రతి ఏడాదీ పునరుద్ధరించాల్సి ఉన్నప్పటికీ.. ఈ గడువును కూడా తాజాగా సౌదీ మూడేళ్లకు పొడిగించింది ($3 billion Pakistan suppor).
తాజాగా సౌదీ నుంచి తీసుకున్న మూడు బిలియన్ డాలర్లు తమ విదేశీ మారక నిల్వలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడతాయని పాక్ మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు (Pakistan economy crisis). వాషింగ్టన్‌లో జరుగుతున్న ప్రపంచబ్యాంక్-ఐఎంఎఫ్ సమావేశాల్లో భాగంగా సౌదీతో ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటోంది.
ఇవి కూడా చదవండి..
మాకు రూ.25 లక్షల కోట్లు చెల్లించండి.. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్..
ఇరాన్‌తో చర్చలు.. అమెరికా పెట్టిన రెండు షరతులు అవేనా..