రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. అత్యంత సంపన్న మహిళ వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర ప్రభావం..
ABN , Publish Date - Aug 12 , 2026 | 04:33 PM
రష్యాలో అతిపెద్ద ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్‌బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్‌కు పెద్ద సవాలుగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ప్రభావం రష్యాలోని కీలక వాణిజ్య సంస్థలపై కూడా తీవ్రంగా పడుతోంది. రష్యాలో అతిపెద్ద ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్‌బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్‌కు పెద్ద సవాలుగా మారింది (Tatyana Kim Wildberries).
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన కీలక సరఫరా, నిల్వ కేంద్రాలు దెబ్బతిన్నాయి. రష్యా వ్యాప్తంగా ఉన్న సంస్థ లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగినట్లు సమాచారం. దీంతో సంస్థ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అలాగే వైల్డ్‌బెర్రీస్‌పై ఆధారపడే వేలాది మంది వ్యాపారులపై కూడా ప్రభావం పడింది. దాడుల కారణంగా పలు గిడ్డంగుల్లో నిల్వ ఉన్న వస్తువులు ధ్వంసమయ్యాయి. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు తమ సరుకును కోల్పోయారు. ఆర్డర్ల పంపిణీలో జాప్యం ఏర్పడటంతో వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు (Ukraine Drone Attack).
వైల్డ్‌బెర్రీస్ గిడ్డంగులు రష్యా యుద్ధానికి అవసరమైన వస్తువుల సరఫరాలో ఉపయోగపడుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది (Wildberries Warehouses). అందువల్ల వాటిని లక్ష్యాలుగా చేసుకున్నామని చెబుతోంది. అయితే రష్యా ఈ వాదనను తిరస్కరిస్తోంది. ఇవి పౌర వాణిజ్య మౌలిక వసతులని, వాటిపై దాడులు చేయడం వల్ల సాధారణ వ్యాపారులు, వినియోగదారులే నష్టపోతున్నారని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం..
భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి