Share News

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:59 AM

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులు చేసింది. సోమవారం తెల్లవారుజామున బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడడంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, దాని పరిసర ప్రాంతాల్లో...

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

  • 21 మంది మృతి, 60 మందికి తీవ్ర గాయాలు

కీవ్‌/మాస్కో, జూలై 6: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులు చేసింది. సోమవారం తెల్లవారుజామున బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడడంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, దాని పరిసర ప్రాంతాల్లో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో కనీసం 21 మంది మృతి చెందగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రష్యా 351 డ్రోన్లు, 68 క్షిపణులు ప్రయోగించగా.. వాటిలో 29 క్షిపణులు లక్ష్యాన్ని తాకినట్లు ఉక్రెయిన్‌ వాయుసేన తెలిపింది. టర్కీలో జరగనున్న నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ కానున్న వేళ ఈ దాడులు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా రష్యా, దాని ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో భారత్‌కు చమురు ఎగుమతి చేసే బాల్టిక్‌ సముద్రంలోని రెండు ప్రధానమైన ఓడరేవులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 06:59 AM