Share News

ఎన్నికలను మేం బహిష్కరిస్తేభారత్‌లో ప్రజాస్వామ్యం ఉండదు

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:39 AM

అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. భారత ఎన్నికల వ్యవస్థపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలను మేం బహిష్కరిస్తేభారత్‌లో ప్రజాస్వామ్యం ఉండదు
Rahul Gandhi

  • పోలింగ్‌ అవకతవకలను బహిర్గతం చేస్తాం

  • షికాగో వర్సిటీలో రాహుల్‌ స్పష్టీకరణ

ఇల్లినాయిస్/న్యూఢిల్లీ, నవంబరు 19: అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. భారత ఎన్నికల వ్యవస్థపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించే ప్రసక్తే లేదని.. బాయ్‌కాట్‌ చేసిన మరుక్షణం ఇండియాలో ప్రజాస్వామ్యం ఉండదని స్పష్టంచేశారు. భారత కాలమానం ప్రకా రం బుధవారం ఇల్లినాయిస్‌లోని షికాగో యూ నివర్సిటీలో ‘ఇరాన్‌ యుద్ధం.. ప్రపంచంలో భారత్‌ పాత్ర’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. అలాగే ఆ వర్సిటీ రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్‌ రాబర్ట్‌ పేప్‌తో చర్చలో పాల్గొన్నారు. భారత్‌లో ఎన్నికలను బహిష్కరించడం కంటే.. పోలింగ్‌ అవకతవకలను బహిర్గతం చేయడం కొనసాగిస్తామని రాహుల్‌ చెప్పారు. కాగా, రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ గురువారం మండిపడింది. విదేశీ గడ్డపై స్వదేశాన్ని అవమానిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. ఒకేమాట పదే పదే చెబుతున్నారని.. ఈ నేపథ్యంలో విదేశాలకు ఆయన్ను పంపేకంటే.. కృత్రిమ మేధ (ఏఐ) ప్రతిరూపాన్ని పంపడం మేలని కాంగ్రె్‌సకు సూచించారు.

మోదీపై శామ్‌ పిట్రోడా ప్రశంసలా.. సిగ్గుచేటు!

ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్(ఐవోసీ) పార్టీ చైర్మన్‌ శామ్‌ పిట్రోడా వ్యవహారంపై ఐవోసీకి చెందిన కీలక నాయకులు నిప్పులు చెరిగారు. విదేశీ గడ్డపై ప్రధాని మోదీని ప్రశంసించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఐవోసీ వైస్‌ చైర్మన్‌ జార్జ్‌ అబ్రహం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఈ -మెయిల్‌లో లేఖ రాశారు.

ఈ వార్తలనూ చదవండి:

చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..

నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన

Updated Date - Nov 20 , 2026 | 03:40 AM