Share News

చైనా పర్యటనలో పుతిన్‌కు అవమానం?

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:16 AM

: చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో ఇటీవల ఏపెక్‌ సదస్సు సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అవమానించారని అంతర్జాతీయ మీడియాలో, ముఖ్యంగా రష్యన్‌ జాతీయవాద వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది

చైనా పర్యటనలో పుతిన్‌కు అవమానం?
puthin

న్యూఢిల్లీ, నవంబరు 20: చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో ఇటీవల ఏపెక్‌ సదస్సు సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అవమానించారని అంతర్జాతీయ మీడియాలో, ముఖ్యంగా రష్యన్‌ జాతీయవాద వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపెక్‌ సదస్సు కోసం వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించడానికి స్వయంగా జిన్‌పింగ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లడం, పుతిన్‌ను స్వాగతించడం కోసం మాత్రం చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు, పార్టీలో ఐదో ర్యాంకులో ఉన్న కైక్విని పంపడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడి కంటే, ఎప్పుడూ వైరం పెట్టుకునే అమెరికా అధ్యక్షుడికే జిన్‌పింగ్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంటున్నారు. అంతేకాకుండా కైక్వి ఎత్తు పుతిన్‌ కంటే 20సెంటీమీటర్లు ఎక్కువ. ఇది పుతిన్‌ను చిన్నబుచ్చడమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు, ట్రంప్‌ విమానం దిగుతున్నప్పుడు చైనా సైనిక బ్యాండ్‌ అమెరికా జాతీయ గీతాన్ని వినిపించింది, అదే పుతిన్‌ వచ్చినప్పుడు సాధారణ సంగీతాన్ని ప్లే చేశారు. ఇక సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రధాన విందులో జిన్‌పింగ్‌ ట్రంప్‌ను తన పక్కన(కుడివైపున) కూర్చోబెట్టుకున్నారు. కానీ, పుతిన్‌ కొంచెం దూరం ఇతర దేశాధినేతల మధ్యలో కూర్చున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 03:41 AM