పాకిస్థాన్ నేవీ భారీ విన్యాసాలు.. కానీ సముద్రంలో పౌరుల రక్షణ సంగతేంటి..
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:49 PM
పాకిస్థాన్ నేవీ ప్రస్తుతం 'సీస్పార్క్-2026' పేరుతో భారీ సముద్ర విన్యాసాలు నిర్వహిస్తోంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, మెరైన్లు, ప్రత్యేక దళాలతో పాటు పాకిస్థాన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ నేవీ ప్రస్తుతం 'సీస్పార్క్-2026' పేరుతో భారీ సముద్ర విన్యాసాలు నిర్వహిస్తోంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, మెరైన్లు, ప్రత్యేక దళాలతో పాటు పాకిస్థాన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సాంప్రదాయ, ఆధునిక సముద్ర ముప్పులను ఎదుర్కొనేందుకు తమ సన్నద్ధతను పరీక్షించడమే ఈ విన్యాసాల ఉద్దేశమని పాకిస్థాన్ చెబుతోంది (Pakistan Navy exercises 2026).
యుద్ధం జరిగితే శత్రువును ఎదుర్కొనే సామర్థ్యం పాకిస్థాన్ నేవీకి ఉండొచ్చు. కానీ విదేశీ సముద్ర జలాల్లో ప్రమాదంలో చిక్కుకున్న తమ పౌరులను రక్షించే సామర్థ్యం ఎంత అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ ప్రశ్నకు కారణం.. ఆగస్టు 11న బాబ్ అల్-మందెబ్ జలసంధిలో తిహ్మాహ్ నౌకపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు మరణించారు. వారిలో ముగ్గురు పాకిస్థానీ సిబ్బంది ఉన్నారు. సముద్రంలో తమ పౌరులకు, సిబ్బందికి ప్రమాదం ఎదురైతే ఇస్లామాబాద్ వేగంగా స్పందించలేకపోతోందని ఎప్పట్నుంచో విమర్శలు ఉన్నాయి (Pakistan Navy SEASPARK 2026).
తిహ్మాహ్ ఘటన తర్వాత కొన్ని వారాలకే పాకిస్థాన్ నేవీ స్పీస్పార్క్-2026 విన్యాసాలను ప్రారంభించింది. కరాచీలో ప్రారంభమైన ఈ విన్యాసాలకు పాకిస్థాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్ నాయకత్వం వహిస్తున్నారు. సముద్రంలో ఎదురయ్యే సాంప్రదాయ ముప్పులతో పాటు కొత్త తరహా ముప్పులను ఎదుర్కొనేందుకు నేవీ ఎంత సిద్ధంగా ఉందో పరీక్షించడం ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశం. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, మానవరహిత వ్యవస్థలు, మెరైన్ దళాలు, ప్రత్యేక బలగాలు ఇందులో భాగమయ్యాయి (Tihamah ship attack).
సముద్ర జలాల్లో యుద్ధ సన్నద్ధతో పాటు సమస్యల్లో చిక్కుకున్న సిబ్బందిని, పౌరులను రక్షించే రెస్క్యూ సామర్థ్యం కూడా ఒక దేశ నేవీ బలాన్ని సూచిస్తుంది (Maritime security). ఈ రెస్క్యూ విభాగంలో పాకిస్థాన్ నేవీ సామర్థ్యం చాలా తక్కువనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..
9/11 దాడులు.. వారం ముందే అమెరికాకు హెచ్చరిక..