Share News

చర్చలు విఫలం.. హోటల్ బిల్లు భారం.. పాకిస్థాన్ పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , Publish Date - Apr 14 , 2026 | 07:26 PM

అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనుకున్న పాకిస్థాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. రెండు దేశాల మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లు కూడా చెల్లించలేక అపఖ్యాతి మూటగట్టుకుంది.

చర్చలు విఫలం.. హోటల్ బిల్లు భారం.. పాకిస్థాన్ పరిస్థితి ఎలా ఉందంటే..
Pakistan unpaid hotel bill controversy

అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనుకున్న పాకిస్థాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. రెండు దేశాల మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లు కూడా చెల్లించలేక అపఖ్యాతి మూటగట్టుకుంది. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరగడంతో పాక్ ఎప్పట్నుంచో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి అప్పులు తెచ్చుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అలాంటి తరుణంలో అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ వచ్చింది (Pakistan unpaid hotel bill).


అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ నెల 10వ తేదీన ఇస్లామబాద్‌కు శాంతి చర్చల కోసం వెళ్లారు. ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనా వేదికగా శాంతి చర్చలు జరిగాయి. ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థానే హోటల్ బిల్లులను కూడా భరించాలి. అయితే హోటల్ బిల్లుల్ని పాక్ ప్రభుత్వం చెల్లించలేకపోయింది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు హోటల్ యజమాని రంగంలోకి దిగాల్సి వచ్చిందని సమాచారం (Serena Hotel Islamabad dues).


బిల్లు చెల్లించాలని, హోటల్ యాజమాన్య సంస్థ అయిన అగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ సంస్థ డిమాండ్ చేస్తోంది (US Iran talks Pakistan issue). ఏదేమైనా పాకిస్థాన్ దౌత్య ఆశయాలకు, అంతర్గతంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులకు మధ్య అంతరాయం ఎంతో ఉంది. అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఆపి ప్రపంచం ముందు సత్తా చాటాలని ఆసక్తి ఉన్నా.. అంతర్గత ఆర్థిక పరిస్థితులు మాత్రం కలిసి రావడం లేదు.


ఇవి కూడా చదవండి..

ఆ ఐదు దేశాలూ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఐక్యరాజ్యసమితికి ఇరాన్ లేఖ..


అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడానికి కారణం అదేనా.. అసలేం జరిగిందంటే..

Updated Date - Apr 14 , 2026 | 07:50 PM