పైలట్ మచ్చార్‌పై దాడి.. అధికారుల విచారణలో బయటపడిన కుట్ర
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:53 AM
భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేయడంతో పాటు ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన ఘటనలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. కోపైలట్ పేరు హమామ్ అల్ హమామీ అని, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించినట్లు వివిధ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేయడంతో పాటు ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన ఘటనలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. కోపైలట్ పేరు హమామ్ అల్ హమామీ అని, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించినట్లు వివిధ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఆ మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముందుగా ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసి, విమానాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి హమామీ పథకం పన్నాడు.
ఈ ప్లాన్‌లో భాగంగా అతను మచ్చార్‌పై తీవ్రంగా దాడి చేశాడు. కానీ, మచ్చార్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిఘటించడంతో హమామీ పథకం ఫలించలేదు. 2024లో ఒమన్ ఎయిర్ కంపెనీలో అతను ట్రైనీ కోపైలట్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అతను విధి నిర్వహణలో ఉండగా.. తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ దొరికింది. దీంతో ఒమన్ ఎయిర్ కంపెనీ అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది. కొంతకాలం తర్వాత అతనికి అదే సంస్థ వేరే బాధ్యతలు అప్పగించింది. అయితే, భద్రతాపరమైన కారణాలను పేర్కొంటూ అతను విమానంలో ప్రయాణించకుండా కంపెనీ నిషేధం విధించింది. ప్రధానంగా తీవ్రవాద భావజాలాన్ని పెంపొందించుకోవడమే దీనికి కారణమని తెలిపింది.
హమామీపై ఒమన్ ఎయిర్ నిషేధం
విధి నిర్వహణలో ఉన్నపుడు తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ దొరకడంతో ఒమన్ ఎయిర్.. హమామీపై నిషేధం విధించింది. ఈ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థ అతడిని ఉద్యోగంలో నియమించింది. యూఏఈ-ఇజ్రాయెల్ మధ్య విమానాన్ని నడిపేందుకు అతడికి అనుమతి ఇచ్చింది. ఈ సంస్థలో అతను 8 నెలల పాటు పనిచేశాడు. అంతకుముందు ఒమన్ ఎయిర్‌లో ఏడేళ్లు పనిచేశాడు. 2025 ఫిబ్రవరిలో ఒమన్ ఎయిర్‌కు రాజీనామా చేశాడు. అదే ఏడాది జూన్‌లో రాయల్ ఎయిర్ మారోక్‌లో చేరాడు. ఈ ఏడాది జనవరిలో ఆ సంస్థకు రాజీనామా చేసి ఫ్లైదుబాయ్‌లో చేరాడు. కాగా.. హమామీ తన జీవితంలో ఎక్కువ కాలం ఒమన్ బయటే గడిపాడు. ఒమన్‌ను వీడి వెళ్లిన తర్వాత అతను సిరియాలో బతికాడు. అక్కడే తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. తర్వాత యూఏఈకి వెళ్లాడు.
తండ్రిది ఒమన్, తల్లిది సిరియా
హమామ్ అల్ హమామీ తండ్రిది యూఏఈ కాగా.. తల్లిది సిరియా. వారికి అతను యూఏఈలో పుట్టాడు. అక్కడే కొన్నేళ్లు గడిపాడు. కాగా.. ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన ఘటనలో ప్రస్తుతం హమానీని సౌదీ అరేబియా నుంచి యూఏఈకి తరలించారు. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ అతనిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇజ్రాయెల్‌ను ఒమన్ సాధారణంగా గుర్తించదు. అలాంటిది ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో ఒక ఒమనీ పౌరుడిని ఎలా అనుమతించారన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఫ్లైదుబాయ్ విమాన సిబ్బందిలో హమానీ ఎలా చేరాడన్న వ్యవహారంపై ఇజ్రాయెలీ ఏజెన్సీలు షిన్ బెట్, మొసాద్‌తో పాటు మిలిటరీ, రవాణా మంత్రిత్వశాఖలు దర్యాప్తు చేస్తున్నాయి.
ఇవీ చదవండి:
పర్వతాలు.. శిఖరాలు.. సరస్సులు.. లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు
ఏపీ మీదుగా మరో వందేభారత్ స్లీపర్.. హాల్ట్స్ ఇవే?