Share News

ఈ ఇంటి కాంట్రాక్టర్‌కు దండం పెట్టొచ్చు.. నేపాల్ వరదల్లో షాకింగ్ ఘటన..

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:22 PM

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, భవనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా.. ఓ ఇంట్లో ఉన్న కుటుంబం మాత్రం సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఇంటి కాంట్రాక్టర్‌కు దండం పెట్టొచ్చు.. నేపాల్ వరదల్లో షాకింగ్ ఘటన..
Nepal Floods Family Survives

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. వరద ఉధృతికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, భవనాలు, శిథిలాలు కొట్టుకుపోతుండగా.. ఓ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబం ప్రాణాలతో బయటపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు తమ ఇంట్లో ఉన్నట్లు కనిపిస్తోంది. వారి ఇంటి చుట్టూ వరద నీరు వేగంగా ప్రవహిస్తూ ఒక్కసారిగా ఉధృతమైంది. బురదతో నిండిన వరద ప్రవాహం వేగంగా దూసుకురావడంతో.. దాని మార్గంలో ఉన్న పలు నిర్మాణాలు సైతం కొట్టుకుపోయాయి. అయితే వరద ప్రవాహం ఇంటికి అత్యంత సమీపంగా వచ్చినప్పటికీ.. ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా బయటపడింది. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నా ఆ ఇల్లు మాత్రం పెద్దగా నష్టం లేకుండా నిలబడటం అందరి దృష్టిని ఆకర్షించింది.


ఇదిలా ఉండగా, నేపాల్‌లో ఉన్న భారతీయులను గుర్తించడం తమకు అత్యంత ప్రాధాన్య అంశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో.. సంప్రదింపులకు అందుబాటులో లేని భారత పౌరుల వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 320 మంది భారత పౌరులు, భారత సంతతికి చెందిన మరో 100 మంది వ్యక్తులతో ఇంకా సంప్రదింపులు జరగాల్సి ఉంది.


Also Read:

నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదల

నేపాల్ నుంచి సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్న 21 మంది భారతీయులు

Updated Date - Aug 28 , 2026 | 06:29 PM