Share News

నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదల

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:12 PM

నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద వరదల కారణంగా 552 మంది మరణించారు. 547 మంది మృతుల వివరాలను నేపాల్ ప్రకటించగా మరో ఐదు మరణాల గురించి చైనా మీడియా వెల్లడించింది.

నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదల
Nepal Tibet floods

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద వరదల్లో పడి 552 మంది మరణించారు. 547 మంది మృతుల వివరాలను నేపాల్ ప్రకటించగా మరో ఐదు మరణాల గురించి చైనా మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో 1400 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 178 మంది భారతీయులు సహా 644 మంది వివరాలను నేపాల్ పోలీసులు వెల్లడించారు. గల్లంతైన వారిలో ఇతర దేశాల వారు కూడా ఉన్నారు. వీరి జాబితాను తాజాగా విడుదల చేశారు.


అయితే, నేపాల్‌‌లో సుమారు 320 మంది భారతీయులు గల్లంతైనట్టు విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. మరో వందమంది భారత సంతతి వారి ఆచూకీ కూడా తెలియలేదని తెలిపింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన 21 మంది వరదప్రభావిత ప్రాంతాల నుంచి స్వదేశానికి చేరుకున్నారని కూడా చెప్పారు. త్రిశూలీ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులు సురక్షితంగానే ఉన్నారని కూడా రణధీర్ జైస్వాల్ తెలిపారు.


null

ఇక వరదల కారణంగా చైనాలో ఉండిపోయిన సుమారు 400 మంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని కూడా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. వారిలో చాలా మంది హెల్ప్‌లైన్‌ల ద్వారా భారతీయ ఎంబసీని సంప్రదించారని అన్నారు. 96 మంది ఇప్పటికే నేపాల్‌కు చేరుకున్నారని చెప్పారు. వారిని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన వారినీ తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అయితే, మృతులు, గల్లంతైన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 28 , 2026 | 06:46 PM