స్పెయిన్‌లో రైలు ప్రమాదంపై కట్టలు తెగిన ఆగ్రహం
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:51 PM
స్పెయిన్‌లో రైలు ప్రమాదంపై ఆ దేశ పౌరుల్లో ఆగ్రహం కట్టలు తెగింది. రవాణా శాఖ మంత్రి స్కార్ పుయెంతేపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌత్ మాడ్రిడ్‌లోని ఉర్దాలో బుధవారం రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొని 68 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగతుండగానే మరోవైపు ఘటనా స్థలానికి సమీపంలో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: స్పెయిన్‌లో రైలు ప్రమాదంపై ఆ దేశ పౌరుల్లో ఆగ్రహం కట్టలు తెగింది. రవాణా శాఖ మంత్రి స్కార్ పుయెంతేపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌత్ మాడ్రిడ్‌లోని ఉర్దాలో బుధవారం రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొని 68 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగతుండగానే మరోవైపు ఘటనా స్థలానికి సమీపంలో వందల మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా మంత్రి స్కార్ పుయెంతేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన మృత్యు మంత్రి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులతో నిరసనకారులు గొడవకు దిగారు. దీంతో పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. కాగా.. 2013లో యూరప్‌లో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం తర్వాత అంతటి తీవ్రమైన దుర్ఘటన జరగడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఏడాదిలో స్పెయిన్‌లో రెండు భయంకరమైన రైలు ప్రమాదాలు జరిగాయి.
రాత్రంతా సహాయ కార్యక్రమాలు
ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక బృందాలు బుధవారం రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఎమర్జె్న్సీ వర్కర్లు శకలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికితీస్తున్నారు. సహాయ కార్యక్రమాల కోసం రెండు క్రేన్లను తరలించారు. కాగా.. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ గురువారం ప్రజలను ఉద్దేశిస్తూ టీవీలో మాట్లాడారు. ఘోరమైన రైలు ప్రమాదంతో స్పెయిన్ మొత్తం దుఖసముద్రంలో మునిగిందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. లోపాలను సరిచేస్తామన్నారు. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష పీపుల్స్ పార్టీ గురువారం తన ప్రచార కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుంది. వచ్చే నెలలో స్పెయిన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
రష్యా, ఉక్రెయిన్ల మధ్య అతి త్వరలో శాంతి చర్చలు.. ట్రంప్ వ్యాఖ్యలు
హౌతీలతో కాల్పుల విరమణకు సౌదీ అరేబియా $1 బిలియన్ ఆఫర్ చేసిందా?