Share News

బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి.. అమెరికా పారిపోయిన ఫ్లేవియో బొల్సనారో

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:45 PM

బ్రెజిల్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారు ఫ్లేవియో బొల్సనారో ఎదురుదెబ్బ తిన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ అధక్షపదవికి పోటీపడిన ఆయన ఓటమి పాలయ్యారు.

బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి.. అమెరికా పారిపోయిన ఫ్లేవియో బొల్సనారో
Flavio Bolsonaro

ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారు ఫ్లేవియో బొల్సనారో ఎదురుదెబ్బ తిన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ అధక్షపదవికి పోటీపడిన ఆయన ఓటమి పాలయ్యారు. మరోవైపు అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఉండడంతో ఫ్లేవియో బొల్సనారోపై విచారణ సాగుతోంది. బ్రెజిల్ విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లవద్దని అక్కడి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంతో పాటు అమెరికాకు పారిపోయారు. ఈ విషయాన్ని అగ్ర రాజ్యానికి చెందిన పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.


ప్రస్తుతం బొల్సనారో దక్షిణ ఫ్లోరిడాలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన పాస్‌పోర్ట్‌తో సహా అన్ని పత్రాలను బ్రెజిల్ అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన వామపక్ష లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా.. బొల్సనారోపై మండిపడ్డారు. ఓటమి తరువాత విదేశాలకు పారిపోవడం సిగ్గుచేటని విమర్శించారు.


ఈ వార్తలూ చదవండి

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య అతి త్వరలో శాంతి చర్చలు.. ట్రంప్ వ్యాఖ్యలు

దాడులు ఆపితే బిలియన్‌ డాలర్లు ఇస్తాం

Updated Date - Oct 28 , 2026 | 05:47 PM