Share News

తుఫాన్‌కు కొట్టుకుపోయిన పడవ.. 100 రోజుల తర్వాత ఏమైందంటే..

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:25 PM

తుఫాన్ కారణంగా దారి తప్పిన ఓ కుటుంబం దాదాపు 100 రోజుల పాటు పసిఫిక్ మహాసముద్రంలో చిక్కుకుపోయింది. తొమ్మిది మందితో ప్రారంభమైన ఈ ప్రయాణంలో చివరకు ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

తుఫాన్‌కు కొట్టుకుపోయిన పడవ.. 100 రోజుల తర్వాత ఏమైందంటే..
Pacific Ocean

మైక్రోనేషియా: తుఫాన్ కారణంగా దారి తప్పిన ఓ కుటుంబం దాదాపు 100 రోజుల పాటు పసిఫిక్ మహాసముద్రంలో చిక్కుకుపోయింది. తొమ్మిది మందితో ప్రారంభమైన ఈ ప్రయాణంలో చివరకు ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మైక్రోనేషియాలోని ద్వీపాల వద్ద చోటుచేసుకోగా.. నవంబర్ 1న వెలుగులోకి వచ్చింది.


మైక్రోనేషియాలోని ఓ ద్వీపం నుంచి మరో ద్వీపానికి సరకులు సేకరించేందుకు జులై 30న 20 అడుగుల చిన్న పడవలో తొమ్మిది మంది బయలుదేరారు. ఈ ప్రయాణం దాదాపు గంటపాటు సాగాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో తుఫాన్ రావడంతో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పడవ దారి తప్పింది. కొంతకాలానికి ఇంధనం కూడా అయిపోవడంతో సముద్రంలోనే కొట్టుకుపోయింది. పడవలో ఉన్నవారు అటుగా వెళ్లే నౌకలు, విమానాలకు చేతులు ఊపుతూ సాయం కోసం ఎంతగానో ప్రయత్నించారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు సముద్రంలో లభించిన తాబేళ్లు, పక్షులను తింటూ, వర్షపు నీటిని తాగుతూ రోజుల తరబడి గడిపారు.


కొన్ని రోజులకు ఓ చిన్నారి సహా నలుగురు కుటుంబ సభ్యులు మరణించారు. మిగిలిన వారు వారి మృతదేహాలను తీవ్ర దుఃఖంతో సముద్రంలోనే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు 3,000 మైళ్లకు పైగా ప్రయాణించిన పడవ నవంబర్ 1న కిరిబాటిలోని ఫానింగ్ ద్వీపం తీరానికి చేరుకుంది. అక్కడి గ్రామస్థులు ఐదుగురిని గుర్తించి స్థానిక చర్చి పాస్టర్‌కు అప్పగించారు. తీవ్రమైన పోషకాహార లోపం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

భారత్‌లో దీపావళి వల్లే లాహోర్‌లో కాలుష్యం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

యూపీఏ ప్రభుత్వంలో జోక్యం చేసుకోలేదు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 10 , 2026 | 12:26 PM